ఉమా మహేష్… ఈటీవీ వార్నింగ్

లాక్ డౌన్ వల్ల థియేటర్లలో రిలీజ్ అవ్వాల్సిన సినిమాలన్నీ ముందుగా ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. తర్వాత టీవీల్లో ప్రసారం అవుతున్నాయి. ఇప్పటికే చాలా సినిమాలు ఇలా ఓటీటీల్లో ప్రత్యక్షమయ్యాయి. అయితే రీసెంట్ గా విడుదలైన తెలుగు సినిమాల్లో అంతోఇంతో ఆదరణ దక్కించుకున్న సినిమా “ఉమామహేశ్వర ఉగ్రరూపస్య”. దీంతో సహజంగానే ఈ సినిమా పైరసీకి గురైంది.

ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ను ఈటీవీ గ్రూప్ దక్కించుకుంది. తమ సినిమా పైరసీ అయిందని గ్రహించిన వెంటనే ఆ ఛానెల్ రంగంలోకి దిగింది. “ఉమామహేశ్వర ఉగ్రరూపస్య” శాటిలైట్ రైట్స్ ను తమ సంస్థ దక్కించుకుందని, ఎవరైనా కేబుల్ లో దీన్ని ప్రసారం చేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ప్రకటన ఇచ్చింది.

నిజానికి ఉన్నఫలంగా ఈటీవీ ఇలా స్టేట్ మెంట్ ఇవ్వడానికి ఓ కారణం ఉంది. తూర్పుగోదావరి, విశాఖపట్నం జిల్లాలోని కొన్ని మారుమూల ప్రాంతాల్లో లోకల్ కేబుల్ టీవీ ఆపరేటర్లు ఈ సినిమాను ఆల్రెడీ ప్రసారం చేసేశారు. ఇదే కాదు, ఇంతకుముందు ఓటీటీలో ప్రసారమైన తెలుగు సినిమాలన్నీ ఆల్రెడీ లోకల్ సిటీకేబుల్ ద్వారా టీవీల్లో వచ్చేశాయి. ఇకపై ఇలాంటివి జరగకుండా ఉండేందుకు ఈటీవీ యాజమాన్యం ఇలా పత్రికా ప్రకటన జారీచేసింది.

Advertisement
 

More

Related Stories