Ram Gopal Varma

వ‌ర్మని లైట్ తీస్కోండి: సీఎం బాబు

రాంగోపాల్ వ‌ర్మ తీస్తున్న "ల‌క్ష్మీస్ ఎన్టీఆర్" గురించి తెలుగు దేశం పార్టీ నేత‌లు ఆ పార్టీ అధినేత‌, ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడికి మంగ‌ళ‌వారం వివ‌రించారు. వైసీపీ నేత రాకేష్ రెడ్డి ఈ సినిమాని నిర్మిస్తున్నాడ‌నీ, తెలుగుదేశం పార్టీని ఇరుకున పెట్టాల‌నీ వ‌ర్మ‌తో ఈ సినిమా తీయిస్తున్నార‌ని పార్టీ నేత‌లు ఆయ‌న‌కి తెలిపారు. ఐతే ఈ సినిమా విష‌యంలో అతిగా ఆవేశ‌ప‌డొద్ద‌ని పార్టీ నేత‌ల‌కి సూచించారు. వ‌ర్మ సినిమాకి పెద్ద ప్ర‌జాద‌ర‌ణ ఉండ‌ద‌న్నారు సీఎం.

జ‌నం ప‌ట్టించుకోని సినిమాల గురించి మీరు ఆవేశ‌ప‌డొద్ద‌ని బాబు వారికి తెలిపారు.

'ఎన్టీఆర్ ఆత్మ నాతో స్క్రీన్‌ప్లే రాయిస్తోంది'

వేదిక మారింది కానీ ఆయ‌న వ‌ర్కింగ్ స్ట‌యిల్ మార‌లేదు. ఇదివ‌ర‌కు రాంగోపాల్ వ‌ర్మ త‌న ట్విట్ట‌ర్ ద్వారా హంగామా చేసేవాడు.  ఇపుడు ఫేస్‌బుక్‌లో. ట్విట్ట‌ర్ మీద అల‌క వ‌హించి ఫేస్‌బుక్‌లోకి వ‌చ్చాడు. రామ్‌గోపాల్ వ‌ర్మకిపుడు ఒకే ఒక్క వ్యాప‌కం: ఎన్టీఆర్ సినిమా గురించి అప్‌డేట్ చేయ‌డం, టీవీ ఛానెల్స్‌లో మాట్లాడ‌డం. 

ఎన్టీఆర్ జీవిత చ‌రిత్ర తీస్తున్నట్లు  రామ్‌గోపాల్ వ‌ర్మ రీసెంట్‌గా ప్ర‌క‌టించాడు. ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ అనే పేరుని కూడా ఫిక్స్ చేశాడు. ల‌క్ష్మీపార్వ‌తి ఎన్టీఆర్ జీవితంలోకి వ‌చ్చిన త‌ర్వాత జ‌రిగిన ప‌రిణామాల నేప‌థ్యంగా ఈ క‌థ సాగుతుంద‌ట‌.

Selected an actor for NTR's role: RGV

వ‌ర్మ‌పై వాణీవిశ్వనాథ్ ఫైర్

వాణీ విశ్వ‌నాథ్ రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇవ్వ‌నుంద‌నేది పాత న్యూసే. మ‌ల‌బార్‌ తీరాన‌ పుట్టిన ఈ కేర‌ళ కుట్టి ఆంధ్ర‌ప్ర‌దేశ్ పాలిటిక్స్‌లో హ‌ల్‌చ‌ల్ చేయ‌నుంది. త్వ‌ర‌లోనే అధికారికంగా టీడీపీలో చేరుతుంది. అయిత పార్టీలో చేర‌క‌ముందే...ఆమె తెలుగుదేశం పార్టీ త‌ర‌ఫున మాట్లాడేస్తోంది. రాంగోపాల్ వ‌ర్మపై విమ‌ర్శ‌లు గుప్పించింది.

ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో ఎన్టీఆర్ చ‌రిత్ర‌ని తీస్తున్నా అని వ‌ర్మ ప్ర‌క‌టించిన‌ప్ప‌టి నుంచి తెలుగుదేశం నేత‌లు తెగ వ‌ర్రీ అవుతూ కామెంట్స్ చేస్తున్నారు. అందులో భాగంగా ఇపుడు వాణీ విశ్వ‌నాథ్ స్పందించింది.

బ‌యోపిక్‌: ఆర్జీవీ ప‌నిమ‌నిషి వెర్సెస్ సోమిరెడ్డి ప‌ని మ‌నిషి

బ‌యోపిక్‌: ఆర్జీవీ ప‌నిమ‌నిషి వెర్సెస్ సోమిరెడ్డి ప‌ని మ‌నిషి
ఈ మ‌ధ్య రాంగోపాల్ వ‌ర్మ సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద పెద్ద‌గా సంచ‌ల‌నాలు క్రియేట్ చేయ‌డం లేదు. కానీ ఆయ‌న తీసే ప్ర‌తి సినిమా మీడియాకి మంచి వార్తాస‌రుకు అవుతుంది. వ‌ర్మ సినిమా తీసినంత కాలం మీడియాకి హెడ్‌లైన్స్ వెతుక్కోవాల్సిన ప‌ని ఉండ‌దు. డిస్క‌ష‌న్‌కి ఏ టాఫిక్ సెల‌క్ట్ చేసుకుందామ‌ని టీవీ చానెల్స్ త‌ల‌పట్టుకోవాల్సిన అవ‌స‌రమూ ఉండదు. కావాల్సినంత మెటిరీయ‌ల్ వ‌ర్మ అందిస్తాడు.

Lakshmi's NTR will begin in Feb: RGV

YSR party leader to produce RGV's NTR film

RGV posts about Nagarjuna's film excitedly

RGV releases poster of Lakshmi's NTR

బాల‌య్య‌ని ఇరుకున పెట్టిన వ‌ర్మ‌

ముద్దొచ్చిన‌పుడే (త‌న‌ని) చంక‌నెత్తుకోవాలి అనుకుంటాడు ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ‌. అలా జ‌ర‌గ‌క‌పోతే ఆయ‌న‌కి తిక్క‌రేగుతుంది. ఆ త‌ర్వాత ..అంతే సంగ‌తులు. మొన్న‌టి వ‌ర‌కు బాల‌య్య‌ని తెగ పొగిడాడు వ‌ర్మ‌. ఇపుడు బాల‌య్య‌కి, ఆయ‌న‌కి ప‌డ‌ట్లేదు. దానికి కార‌ణం ఏంటంటే.. ఎన్టీఆర్ బ‌యోపిక్‌ని తీసే అవ‌కాశం వ‌ర్మ‌కి ఇవ్వ‌డం లేదు నంద‌మూరి బాల‌య్య‌.

Pages

Subscribe to RSS - Ram Gopal Varma