ఎన్నో ఫ్లాపులు అయినా ఆఫర్లు!

సంతోష్ శోభన్ పేరు వినే ఉంటారు. హీరోగా ఆయన ఇప్పటికే 9 సినిమాల్లో నటించాడు. ఆడింది ఒక్కటీ లేదు. “ఏక్ మినీ కథ” అనే చిత్రం మాత్రం లాక్డౌన్ టైంలో ఓటిటి వేదికపై సందడి చేసింది. కానీ థియేటర్లలో విడుదల ఒక్క చిత్రమూ ఆడలేదు.

సంతోష్ శోభన్ నటించిన రీసెంట్ చిత్రాలు… కళ్యాణం కమనీయం, శ్రేదేవి శోభన్ బాబు, ప్రేమ్ కుమార్, అన్నీ మంచి శకునములే. ఒక్క దానికి కూడా చెప్పుకోదగ్గ ఓపెనింగ్ రాలేదు. అయినా సంతోష్ శోభన్ కి హీరో ప్రభాస్ అండదండలు ఉన్నాయి. అందుకే, అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. తాజాగా ఈ రోజు ఒక సినిమా ప్రారంభం అయింది.

“బేబీ” దర్శకుడు సాయి రాజేష్, “బేబీ” నిర్మాత ఎస్ కె ఎన్ కలిసి ఒక సినిమా నిర్మిస్తున్నారు. ఇది కూడా లవ్ స్టోరీనే. ఈ సినిమా ఈ రోజు లాంఛనంగా ప్రారంభం అయింది. సంతోష్ శోభన్ సరసన అలేఖ్యా హారిక నటిస్తోంది.

కనీసం ఈ పదో చిత్రంనైనా సంతోష్ శోభన్ హిట్ కళ చూస్తాడా?

Advertisement
 

More

Related Stories