రౌడీగా సుమంత్

Sumanth

సుమంత్ కి సాఫ్ట్ హీరోగా ఇమేజ్ ఉంది. బహుశా సీనియర్ కావడంతో ఇప్పుడు వెరైటీ పాత్రల వైపు చూపు వేసినట్లున్నాడు. ఇటీవలే ఒక సినిమాలో పోలీస్ కానిస్టేబుల్ గా కనిపించిన సుమంత్ తాజాగా రౌడీగా మారాడు. గెటప్ కూడా పూర్తిగా మారిపోయింది.

సుమంత్ నటిస్తున్న తాజా చిత్రం ‘అనగనగా ఒక రౌడీ’. మను యజ్ఞ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని గార్లపాటి రమేష్, డా.టీఎస్ వినీత్ భట్ నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తి అయింది.

వాల్తేరు శీనుగా, విశాఖపట్నం రౌడీగా ఆయన అభినయం అందర్ని అలరించే విధంగా వుంటుందని అంటున్నారు మేకర్స్. ఐమా నాయికగా నటిస్తున్నారు. సినిమాని త్వరలోనే విడుదల చేస్తామని నిర్మాతలు చెపుతున్నారు.

Advertisement
 

More

Related Stories