పాన్ ఇండియా అనేది బ్రాండ్ కాదు – వెంకటేష్

ప్రస్తుతం టాలీవుడ్ లో అందరూ పాన్ ఇండియా మంత్రం జపిస్తున్నారు. చిన్న సినిమాల్ని కూడా పాన్ ఇండియా ప్రాజెక్టుగా ప్రకటించడం ఫ్యాషన్ అయిపోయింది. ఈ రేసులోకి తను మాత్రం ఎంటర్ అవ్వనంటున్నాడు వెంకటేష్. అసలు పాన్ ఇండియా అనేది ఓ బ్రాండ్ కాదని, పాన్ ఇండియా అంటే అదొక మార్కెట్ అంటూ తనదైన విశ్లేషణ ఇస్తున్నాడు.

“పాన్ ఇండియా అనేది నా దృష్టిలో కేవలం బిజినెస్ మాత్రమే. ఓ సినిమాకు దేశవ్యాప్తంగా వసూళ్లు వచ్చేంత కెపాసిటీ ఉంటే కచ్చితంగా వస్తాయి. ఇందులో నాకు ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు. నా సినిమాలైనా దేశవ్యాప్తంగా నచ్చేలా ఉంటే అన్ని రాష్ట్రాల్లో వసూళ్లు వస్తాయి. నేను ఆ రేంజ్ లో ఇంకా ఆలోచించలేదు.”

ఇలా పాన్ ఇండియాకు తనదైన అర్థం చెప్పాడు వెంకటేష్. ఆ స్థాయిలో కంటెంట్ దొరికితే తను కూడా పాన్ ఇండియా సినిమా చేయడానికి రెడీ అని ప్రకటించిన వెంకీ.. కంటెంట్ మాత్రమే ఉంటే సరిపోదంటున్నాడు.

“పాన్ ఇండియా కంటెంట్ వస్తే నేను కూడా చేస్తాను. కానీ సమస్య ఇక్కడ అది కాదు. కంటెంట్ తో పాటు టీమ్ కూడా సెట్ అవ్వాలి. పాన్ ఇండియా లెవెల్లో సినిమా ఆడాలంటే దర్శకుడు, నిర్మాత కూడా అదే రేంజ్ లో ఉండాలి.”

ప్రస్తుతం తనకు దక్కినదానితో తాను సంతృప్తిగా ఉన్నానని ప్రకటించాడు వెంకటేష్. మనకు ఏదో దక్కలేదని నిరాశ చెందే కంటే, ఉన్నదానితో తృప్తిపడడం తనకు ఇష్టమన్నాడు. దేవుడు ఇప్పటికే తనకు చాలా ఇచ్చాడని, తను పూర్తి సంతృప్తితో ఉన్నానని ప్రకటించాడు.

Advertisement
 

More

Related Stories