Wednesday, January 7, 2009
Telugucinema.Com
July 18Jan 5
Articles : Guest Articles : Open letter to Chiranjeevi  
Guest Articles
Latest Headlines
Guest Article : Acting Workshop @ NYFA
Guest Article : Open Letter to Open Minds
Report : Balu bay area tour
Fans Tribute to : మా" గోపాల్ రెడ్డి గారు.
Readers Review : Victory
Reader's Review : Koncham Kottaga
Readers Review : Ready
Readers Reviews :Dasavatharam
Reader's Digest : Dance
On Location with Venky in US
Readers Review : Pandurangadu
Readers Review : Bujjigadu
Readers Review : ka"NTR"i
Jalsa : A Reader's Review
Me and My Hero Shoban
Open letter to Chiranjeevi
Unbiased review of Dr. Raj - Dr.Chiru
Open letter to Rajashekar
Reader's Review : Mr. Medhavi
Reader's Review : Anasuya


Open letter to Chiranjeevi
Feb 8, 2008 - 1:40:55 AM
Page: 1 2 3
   

శ్రీయుత చిరంజీవి గారికి (లెజెండ్, పద్మభూషణ్‌లను మేము మరచిపోలేదు)

అయ్యా,

తమరు చిత్రపరిశ్రమలో ఎంతటి ప్రముఖవ్యక్తులో పాలు తాగే పసి పిల్లాడికి కూడా తెలుసు. కులమతాలకు అతీతంగా లక్షలాది మంది అభిమానుల్ని సొంతం చేసుకున్న మహర్జాతకం మీది. మిమ్మల్ని అభిమానించేవారిలో మేమూ ఒకరం. కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు మీ పట్ల ఉన్న అభిమానాన్ని దెబ్బతీసేలా ఉన్నాయి. వాటికి స్వయంగా మీరు, మీ సోదరులు, మీ బావమరిది కావటం జీర్ణించుకోలేకపోతున్నాం. ఏతా వాతా మాకనిపిస్తోందేమంటే మీరు కూడా చిల్లర రాజకీయ (నాయకుడు కాదు) వేత్తల బాణీలో సాగుతున్నారని.

మీరు ప్రజలకు సేవ చేయాలని తలచి, రాజకీయాలను మార్గంగా ఎంచుకోవాలనుకోవటంలో ఎలాంటి అభ్యంతరమూ లేదు. ఉండాల్సిన అవసరమూ లేదు. కానీ దానికి మీరు అనుసరిస్తున్న మార్గం మాత్రం చాలా జుగుప్సాకరంగా ఉంది. పైగా మీ ఉద్దేశాలని వేరెవరికో ఆపాదించి మాట్లాడటం మీ స్థాయి వ్యక్తులకు సముచితం కాదు. మీ ఆప్తమిత్రుడు డాక్టర్ కాసు ప్రసాదరెడ్డి స్వయంగా విలేఖరులకు ఫోన్లు చేసి, మాట్లాడదామని ఆహ్వానించి, కూర్చోబెట్టి గంటల కొద్దీ మాట్లాడి మరీ మీ రాజకీయప్రవేశాన్ని లీక్ చేసారు. దాని పై వివిధ పక్షాల స్పందన, జనం మనోగతాన్ని మీరు, మీ అనుయాయులు తెలుసుకునేందుకు అన్ని పత్రికలూ యథాశక్తి తోడ్పడ్డాయి. పాపం అమాయక అభిమానులు మీరు రావాలని, వారి జీవితాలను ఏదో చేసెయ్యాలని ఆకాంక్ష్స్తూ సమయం వృథా చేసుకుంటూ రాష్ట్రమంతటా నానా యాగీ చేసారు. మీరు, మీ అనుంగు సహచరులు చిద్విలాసంగా చూస్తూ కూర్చున్నారు. తరువాత కర్ర విరగకుండా, పాము చావకుండా ఓ ప్రకటన పంపి చేతులు దులుపుకున్నారు. ఏ పరిస్థితుల కారణంగానైనా నిర్ణయాన్ని వాయిదా వేసుకోవలసి వస్తే పెద్దగా నిరసన రాకుండా 'నేను స్వయంగా చెప్పలేదు కదా' అని తప్పించుకునేందుకు మీ ఎత్తుగడ అది. ఇవన్నీ నడిపించింది మీరేనని రాష్ట్రంలో అందరికీ తెలుసు. కానీ... ఆశ్చర్యకరంగా మీ తండ్రిగారి పెద్దకర్మ రోజున మీ బావమరిది మాట్లాడుతూ... 'మీడియానే మమ్మల్ని ప్లాట్‌ఫాంపైకి తీసుకువచ్చిందీ అని వ్యాఖ్యానించారు. మీకిష్టం లేకుండానే ఎవరో మీ చేత బలవంతంగా రాజకీయ ప్రవేశం చేయిస్తున్నట్లు వాపోయారు. ప్రసాదరెడ్డిని ఎవరైనా మాతో మాట్లాడమని, విషయం లీక్ చెయ్యమని మెడ మీద కత్తి పెట్టి భయపెట్టారా? లేక లండన్, అమెరికాల్లో ప్రవాసాంధ్రుల్ని కలసి 'పార్టీ పెట్టేందుకు 150 కోట్లు అవసరమౌతాయి. అంత నావద్ద లేవూ అని దీనాలాపనలు చేయమని మిమ్మల్ని వేరెవరైనా బెదిరించారా?

చిరంజీవి గారూ... ఓ విషయం మాకు బోధపడటంలేదు. ఇపుడు అకస్మాత్తుగా రాజకీయాల్లోకి వచ్చేసి, అసాధారణ మెజారిటీతో (280-290 మధ్య సీట్లు సాధించి), ముఖ్యమంత్రి అయిపోయి, మీ తమ్ములుంగార్లు డీఫ్యాక్టో ముఖ్యమంత్రులుగా, మీ బావమరిది మహామంత్రి మరో తిమ్మరుసు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా ఉండటం తప్ప, ఆంధ్రరాష్ట్రానికి, ఇక్కడి ఎనిమిదిన్నర కోట్ల మంది దీనులకు సేవ చేసేందుకు మరో మార్గం లేదా? బ్లడ్ బ్యాంకు, ఐ బ్యాంకులను ఇదే దృష్టితో పెట్టారా? నిజమే అనిపిస్తోంది ఇప్పుడు మరి... అవి భవిష్యత్తు రాజకీయాలకు సోపానాలుగా పనికి వస్తాయన్న మీ ముందుచూపుకు నిజంగా చేతులెత్తి దండం పెట్టాలి. ఆంధ్రజ్యోతి డ్రాలకు, ఆ పత్రిక ఎండీ రాధాకృష్ణ ఇంట్లో వివాహానికి సకుటుంబ సపరివార సమేతంగా తమరు విచ్చేయటం, "చిరుత" ప్రత్యేక షోకు రాధాకృష్ణా అదే స్థాయిలో రావటం... ఆ తరువాత మీ మిత్రుడు ప్రసాదరెడ్డిని విలేఖరులు బెదిరించి రాబట్టిన విషయాలపై ఆంధ్రజ్యోతి వరుసగా వారం రోజుల పాటు గాల్లోంచి విభూతి సృష్టించినట్లు విషయం లేకుండా పతాక కథనాలు ఇవ్వటం, తమ ప్రత్యేక శక్తి ద్వారా ఎక్కడా తిరగకుండానే జనం మనోభావాల్ని తెలిసేసుకుని వ్రాసేయటం, వీటన్నింటికీ ఏమైనా అవినాభావ సంబంధం ఉందా అని మేము బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నాం. తరువాత మీరు పార్టీ ప్రకటన చేయగానే వై.ఎస్. అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్ళేందుకు సిద్ధ అవుతారన్న భయంతో మీ నిర్ణయాన్ని వాయిదా వేసుకోవటం ప్రజాసేవకు మంచి ఎత్తుగడే.

Comments

© Copyright by Telugucinema.com

  Comments Page: 1 2 3

Top of Page




Web TC
Email login
PittsburghIndian.com
ClevelandIndian.net
ColumbusIndia.net
 

Copyright © 1997 - 2008 Telugucinema.Com. All rights reserved. Reproduction in whole or in part in any form or medium without express written permission of Telugucinema.Com is prohibited.

 
Home     News     Articles     Interviews     Box-office     Reviews     Schedules     Gallery     Blog