Boy friend భరత్ గుర్తు ఉన్నాడా? పోని భరత్ నందన్ లెక పొతె భరత్ పారేపల్లి లేక భరత్. పి వగైరా, (మీ తప్పు కాదు లెండి గుర్తు లేకపోతే ఈయన ఒకొ చిత్రానికి ఒకో నామధేయం తొ వస్తాడు) అదేనండి మైసమ్మ IPS దర్శకుడు. ఈయన మొదటి చిత్రం పేరు boy friend సాయికృష్ణ , పూజా భట్ లతొ తీసాడు. అది అంతంత మాత్రంగా అడింది. అయన మలిచిత్రం గా అయనే నాయకుడిగా, భారతి (విక్రం సేతు లొ వదిన పాత్ర వేసిన అమ్మాయి) అనే అమ్మాయి నాయకగా, మద్రాస్ అబ్బాయి భాస్కర్ (ఈ మధ్యే ఈయన ఒక ప్రమాదం లొ మరణించారు ) మరో నాయకుడిగా తీసిన చిత్రం తపస్సు. చిత్రం లొ Sharukh khan నటించిన హింది చిత్రం Darr పొలికలు బాగ కనపడతాయి (దర్షకుడు ఆ మాట ఒప్పుకొలేదు లెండి). చిత్రం లొ పాటలు తప్ప మొత్తం Hyderabad లొనే తీసారు. పాటలు మాత్రం అరకు, వైజాగ్ లొ తీసారు. చిత్రానికి ఆవధాని అని నిర్మాత పేరు ఉన్నప్పిటికీ , భరత్, భాస్కర్ లు కూడా భాగస్వాములు. చిత్రం లొ చెప్పుకోదగ్గది కోటి సంగీతం. రాజ్ తొ విడిపొయిన కోటి ఈ చిత్రం లొ తన సత్తా చాటుకున్నాడు. మల్గాడి శుభ అనగానే మనకి గుర్తు వచ్చేది మత్తెకించే పాటలు, కాని ఈ చిత్రం లొ ఒక మధురమైన పాట పాడింది (ఆ పాట దొరకడం లేదులెండి).
భరత్ ఈ చిత్రం అడలేదు అని నిరుత్సాహ పడకుండా, పట్టువదలని "వీరుడు" (వినొద్ కుమార్ నాయకుడిగా) లాగా చిత్రలమీద చిత్రాలు తీస్తూ, నిర్మాతలకి, ప్రేక్షకులకి శొకాలు (శ్లొకం అని ఇంకొ సిత్రం లెండి ఈయనది) తెప్పిస్తు ఈమధ్యే ముమైత్ ఖాన్ ని మైసమ్మని చేసి మనని భయపెట్టాడు. అది లాభాలు తెచ్చింది అని అయన, బొగ్గెం కాదు(మాజీ బొగ్గు గనుల మంత్రి దీనికి గుప్త నిర్మాత అంటారు లెండి)అని మనము అంటాం.
తపస్సు చిత్రం లొని అందమైన రెండు పాటలు మీకోసం