ఎం వి రఘు అనగానే మనకి సితార వంశి గుర్తు రాక మానరు. స్వహతగా ఛాయాగ్రహుడైన రఘు, ఆంధ్ర దేశాన్ని ఒక ఉపు ఉపిన గొల్లపూడి గారి నాటకం కళ్లు తో దర్శకుడిగా మారారు. దానికి బోలెడు నందులు వచ్చాయి (శివాజీ రాజా , కళ్లు చిదంబరం గట్రా ఈ చిత్రం ద్వారా పరిచయం అయ్యారు). కళ్లు చిత్రంలో సీతారామ శాస్త్రి గారు మొదటి సారిగా పాడారు కూడా..ఇక ప్రస్తుత చిత్రానికి వస్తే ఇది రఘు కి రెండొ చిత్రం (అఖరిది కూడా దర్శకుడిగా).
విదు వినొద్ చొప్రా (1942, Love story, పరిందా , Mission Kashmir, Munnabhai (producer) గట్రా తీసిన అయన) కి నాలుగో చిత్రం ఖమొష్ (1985) (Murder at monkey hill -1977 (ఇది ఈయన film institute లొ విధ్యార్ధిగా ఉన్నపుదు తీసింది, దీని అధారంగా ఆంతం, కిల్లర్ లాంటి సినిమాలు అనేకం వచ్చాయి ) An Encounter with Faces 1979, Sazaye Maut - 1981). ఖమొష్, షబనా ఆజ్మి, నసిరిద్దున్ షహ్ , ఆమొల్ పలేకర్ ప్రధాన తారగణంగా వచ్చింది (Hyderabad Royal 70MM లొ విడుదల అయింది). చిత్రం మరి పెద్దగా recordలు బద్దలు కొట్టక పోయినా బాగానే అడింది. దీనికి పని చేసిన సాంకేతిక వర్గం తరవాత మంచి పేరు తెచ్చుకుంది (చాయగ్రహణం - బినొద్ పర్ధాన్ - పవన్ పులి కి చాయాగ్రాహకుడు ఇప్పుడు), editing - రేణు సలుజా ఈ మధ్యే మరణించారు, national award winner )
రఘు తన మలిచిత్రానికి ఖామొష్ కథ ఎన్నుకున్నాడు, చిత్రం లొ ఉన్న వైవిధ్యం ఎంటి అంటే సినిమా మొత్తం ఒక చిత్రం షూటింగ్ కి వెళ్ళిన యునిట్ మధ్య జరుగుతుంది. కథానాయకి ని హత్య చెయ్యడానికి ప్రయత్నం జరుగుతుంది ఎవరు చేసారు? దేనికి? అన్నది అర్ధం కాదు. మధ్యలొ వచ్చిన బైట వ్యక్తి మీద అనుమానం, నిదర్షనాలు కనపడతాయి. చివరకు ఎం జరుగుతొందొ తెలుసు మాములుగా చిత్రాలు ఎక్కువ చూసే వాళ్ళకి. తెలుగు లొ మార్పులు చేర్పులు చేసారు లెండి హింది వాళ్ళు కథ నాది అని గోల పెట్టకుండా.
తెలుగు లొ షబనా ఆజ్మి పాత్రకి సీత, నసిరిద్దున్ షహ్ పాత్రకి రాజశేఖర్ ఆమొల్ పలేకర్ పాత్ర చంద్రమోహన్ మొదలగు వాళ్ళు వేసారు. చిత్రం మొత్తం ఊటి లొ బృందావన్ అతిధి గృహంలొ తీసారు. (వీళ్ళ బస కూడా అక్కడే లెండి). చిత్రం మొత్తం 30 రొజుల్లొ పూర్తి చేసారు షూటింగ్. Hyderabad Odean 70MM theatre లొ విడుదల అయింది. చిత్రం విడుదల అయిన వారానికి అంకుశం విడుదల అయింది. రాజశెఖర్ కి ఒక image ఆ చిత్రం ద్వారా వచ్చి అది పెద్ద హిట్ అయింది. ఇది మాత్రం ఒక ఐదు వారాలు ఆడింది. చిత్రం లొ చెప్పుకోదగ్గది హంసలేఖ సంగీతం హంసలెఖ అనగానే మనకి గుర్తు వచ్చేవి (స్వాతి ముత్యపు జల్లుల్లలో - ప్రేమయుద్దం, ముత్యమంత ముద్దు, శాంతి క్రాంతి పాటలు) కాని దీంట్లొ కూడా ఆయన ముద్ర బాగా కనపడుతుంది. సినిమా అడక పోవడం వల్ల అంతగా ప్రాచుర్యం పొందలేదు ఎమో అని కూడా అనిపిస్తుంది, అంటే ప్రేమ యుద్దం, శాంతి క్రాంతి హిట్ అని కాదు కాని ఆ పాటలు విడుదలకి ముందే బాగా హిట్ అయ్యాయి).
ఈ పాటల్లొ ఇంకొ విశేషం ఎంటి అంటే .. అప్పట్లొ censor officer గా పనిచెస్తున్న సరళ గారు ఈ చిత్రానికి పాట పాడారు. అబ్బ నీ సొకు మాడా పాట. దీని తరువాత మరి వేరే చిత్రాలకి పాదారొ లేదో మరి తెలీదు