Telugucinema.Com

Movie Tidbits
డిసెంబర్ మొదటి వారం లో అందరిబందువయ పాటలు
By
Nov 20, 2009 - 10:02:36 AM


Chandra siddhartha with Sharwanand

శర్వానంద్ , పద్మ ప్రియ జంట గా చంద్ర సిద్ధార్థ నిర్మాత దర్శకుడిగా నిర్మితమవుతున్న అందరిబందువయ చిత్రం షూటింగ్ పూర్తికావొచ్చింది.   ఇటీవల రెండు పాటలను చిత్రీకరించడంతో షూటింగ్ పూర్తయిందనీ, వీటిని అరకు, విశాఖ లొకేషన్లలో తీశామనీ చంద్ర సిద్దార్థ తెలిపారు . ఈ చిత్రంలో 7 పాటలు ఉన్నాయనీ, డిసెంబర్ మొదటివారంలో ఆడియో విడుదల చేస్తామని చెప్పారు. ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నట్టు తెలిపారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో నరేష్, కృష్ణ భగవాన్, ఎమ్మెస్ నారాయణ, ఆర్.కె., ప్రగతి, విజయ్ తదితరులు నటించారు. చైతన్య ప్రసాద్ పాటలు, జె.కె.గుమ్మడి సినిమాటోగ్రఫీ, అనూప్ సంగీతం అందించారు.

© Copyright by Telugucinema.com



© Copyright by Telugucinema.com



© Copyright by Telugucinema.com