నా లిస్ట్‌ అంత పెద్ద‌ది కాదు: శ్రీరెడ్డి

అంద‌రూ భావిస్తున్న‌ట్లు తాను ఎక్కువ మందితో సంబంధాలు పెట్టుకోలేదంటోంది శ్రీరెడ్డి.

వివాదాల‌కి మారుపేరుగా మారిన శ్రీరెడ్డి....అవ‌కాశాల కోసం త‌న‌ని ఎంద‌రో వాడుకున్నార‌ని బయ‌ట‌పెట్టి సంచ‌ల‌నం సృష్టించింది. మొద‌ట ఆమె చేసిన ఆరోప‌ణ‌ల్లో, ఆమె ఆవేద‌న‌లో కొంత నిజ‌ముంద‌నిపించింది. ఐతే ఆ త‌ర్వాత ఆమె చేస్తున్న ఆరోప‌ణలు జుగుప్స క‌లిగించ‌డం మొద‌లు పెట్టాయి. ఇదంతా ప‌బ్లిసిటీ కోసమే చేస్తున్న భావ‌న అంద‌రిలో మొద‌లైంది.

హ్యాపి వెడ్డింగ్ ప్రీ వెడ్డింగ్

సుమంత్ అశ్విన్‌, నీహారిక కొణిదెల జంటగా నటించిన చిత్రం "హ్యాపి వెడ్డింగ్". యువి క్రియేష‌న్స్, పాకెట్ సినిమా సంయుక్తంగా ఈ సినిమా నిర్మిస్తోంది. ల‌క్ష్మ‌ణ్ కార్య దర్శకుడు. ఈ నెల 21న ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ ని గ్రాండ్ గా చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

"పెళ్లి అనేది ప్ర‌తి ఒక్క‌రి జీవితంలో జ‌రిగే విష‌య‌మే. అయితే పెళ్ళి కుదిరిన రోజు నుండి పెళ్ళి జ‌రిగేరోజు వ‌ర‌కు రెండు కుటుంబాల మధ్య, రెండు మ‌న‌సుల మ‌ధ్య ఏం జ‌రుగుతుంద‌నే విష‌యాన్ని చాలా అందంగా చూపించామంటున్నారు మేక‌ర్స్‌.

ఈ తెలుగు భామ మెప్పిస్తుందా?

శోభిత ధూళిపాల గురించి నెటిజ‌నుల‌కి తెలుసు. ఆమె అంద‌చందాలు అలాంటివి మ‌రి. ఎన్నో అందాల పోటీల్లో పాల్గొంది. కొన్ని టైటిల్స్ కూడా గెలుచుకొని బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది శోభిత‌. ఆమె న‌టించిన రామ‌న్ రాఘ‌వ్ అనే బాలీవుడ్ సినిమా బాగా పాపుల‌ర్‌.

Pages

Subscribe to telugucinema.com RSS