ఆంధ్రాలో అలా, తెలంగాణాలో ఇలా!

Cinema Theaters


ఆంధ్రప్రదేశ్ లో టికెట్ రేట్లను ఆ రాష్ట్ర ప్రభుత్వం భారీగా తగ్గించింది. కొన్ని మండల స్థాయి, గ్రామ స్థాయిలో ఉండే థియేటర్లలో 15 రూపాయలు, 30 రూపాయల రేట్ ని ఖరారు చేసింది. దాంతో, థియేటర్ల ఓనర్లు లబోదిబోమంటున్నారు. ఈ రేట్లకు కరెంట్ బిల్ డబ్బులు కూడా రావు అనేది వాస్తవం.

ఆంధ్రపదేశ్ లో రేట్లు పెంచాల్సిన అవసరం ఉంది. అక్కడ సినిమా పిచ్చి ఎక్కువ. 200 వరకు పెట్టి సినిమా చూసే అభిమానులున్నారు.

ఇక తెలంగాణాలో కేసీఆర్ ప్రభుత్వం ఏకంగా 300 రూపాయల వరకు రేట్లు పెంచుకునే అవకాశం ఇచ్చింది. మల్టిప్లెక్స్ లలో 250 టికెట్ రేటుతో పాటు జీఎస్టీ కూడా తీసుకునే సౌలభ్యం కల్పించింది. ఇది మాక్సిమం రేట్. ఐతే, జీవో ఇచ్చిన వెంటనే చిన్న సినేమానా, పెద్ద సినిమానా అని తేడా చూడకుండా మల్టిప్లెక్స్ యాజమాన్యాలు ఈ శుక్రవారమే ఈ రేట్స్ ని అమల్లో పెడుతున్నాయి.

రేపు విడుదల కానున్న ‘అర్జున ఫల్గుణ’ అనే చిత్రానికి అన్ని మల్టిప్లెక్స్ లలో 295 రూపాయల రేట్ ని ఫిక్స్ చేశారు. అంటే ఒక టికెట్ ఖరీదు 295 రూపాయలు. మరో తక్కువ స్లాట్ లేనే లేదు. ఇది మరీ ఎక్కువ రేట్. చిన్న సినిమాలకు పెద్ద గుదిబండ.

ఆంధ్రాలో మరి తక్కువగా ఉంటే, తెలంగాణాలో మరీ ఎక్కువ అయిపోయాయి రేట్స్. రెండు ప్రభుత్వాలు… వాస్తవిక కోణంలో ఆలోచించాలి.

Advertisement
 

More

Related Stories