ఇందులో ఎదో ఒకటి!

Jeevitha

ఒకప్పటి హీరోయిన్ జీవిత లక్ష్యం ఎమ్మెల్యే కావాలనేది. ఆంధ్రాలో పుట్టి తమిళనాడులో పెరిగి తెలంగాణాలో సెటిల్ అయిన జీవిత ఇప్పుడు బీజేపీలో ఉన్నారు. అంతకుముందు ఆమె అనేక పార్టీల్లో ఉన్నారు. మొత్తానికి ఇప్పుడు బీజేపీలో ఉన్నారు. అంతే కాదు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు.

ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే వారు అప్లికేషన్ పెట్టుకోవాలని బీజేపీ అధినాయకత్వం ఇటీవల ప్రకటించింది. దాంతో, జీవిత కూడా నాలుగు చోట్ల పోటీకి సిద్ధం అంటూ నాలుగు అప్లికేషన్లు నింపారు. ఆమె కోరుకుంటున్న సీట్లు అన్నీ హైదరాబాద్ లోనే. సికింద్రాబాద్, సనత్ నగర్, జూబ్లీహిల్స్, కూకట్ పల్లి నియోజకవర్గాల్లో ఏదో ఒక చోటు నుంచి తనని అభ్యర్థిగా నిలపాలని ఆమె కోరుతున్నారు.

బీజేపీకి హైదరాబాద్ సిటీలో అభ్యర్థుల కరువు లేదు. కానీ జీవిత కోరుకుంటున్న ఈ నాలుగు సీట్లలో ఆమెకి ఈ సీటు ఇస్తారో చూడాలి.

ఆమె భర్త రాజశేఖర్, ఆమె పిల్లలు శివాత్మిక, శివాని కూడా నటులే. సో, ఆమె పోటీలో నిలబడితే అందరూ ప్రచారంలోకి దిగుతారు. ఆ ఆవిధంగా బీజేపీకి “స్టార్” క్యాంపేనర్లు ఎక్కువ దొరుకుతారు.

Advertisement
 

More

Related Stories