జనవరిలో ‘నా పేరు శివ 2’

తమిళ హీరో కార్తీ నటించిన హిట్ చిత్రాల్లో ఒకటి… ‘నా పేరు శివ’. ఆ సినిమాని నిర్మించిన స్టూడియో గ్రీన్ ఇప్పుడు మరో సినిమాని తెలుగు ప్రేక్షకుల ముందుకు తెస్తోంది. కార్తీ, క్యాథరిన్ నటించిన ఈ మూవీకి ‘నా పేరు శివ 2’ అనే పేరు పెట్టారు.

అలా అని ఇదేదో కొత్త సినిమా అనుకోవద్దు. కార్తీ హీరోగా ‘కబాలి’ దర్శకుడు పా.రంజిత్ డైరెక్ట్ చేసిన ‘మద్రాస్’ అనే సినిమాకి తెలుగు అనువాద రూపం. 2014లో విడుదలైంది ‘మద్రాస్’. ఎనిమిది ఏళ్ల తర్వాత దాన్ని ఎందుకు డబ్ చేస్తున్నారో తెలీదు.

ఐతే, ‘నా పేరు శివ 2’ సినిమాని థియేటర్ లలో రిలీజ్ చేస్తున్నామని అంటున్నారు నిర్మాత స్టూడియో గ్రీన్ జ్ఞానవేల్ రాజా.

‘నార్త్ మద్రాస్’ నేపథ్యంగా సాగే పొలిటికల్ థ్రిల్లర్ ఇది. కార్తీకి చాలా మంచి పేరు వచ్చింది. దర్శకుడు పా.రంజిత్ కెరీర్ తొలినాళ్ళల్లో మంచి విజయం సాధించిన మూవీ ఇది.

Advertisement
 

More

Related Stories