మూడింట్లో ఒకటా? రెండా?

NaniNani


నాని నటిస్తున్న మూడు సినిమాల్లో ఈ ఏడాది రెండు వస్తాయా? ఒకటి మాత్రమేనా? నాని నటించిన ‘టక్ జగదీష్’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. అన్ని అనుకున్నట్లు జరిగితే, ఈ సినిమా వచ్చే నెలలోనే విడుదలవుతుంది. లేదంటే ఆగస్ట్ లో.

ఇక మరో రెండు సినిమాలు కూడా సెట్స్ పై ఉన్నాయి. అవే ‘శ్యామ్ సింగ రాయ్’, ‘అంటే సుందరానికి’. ఇందులో ‘శ్యామ్ సింగ రాయ్’ షూటింగ్ చివరి దశకు చేరుకొంది. మరో నెల రోజుల్లో గుమ్మడి కాయ కొట్టేస్తారు. మరి ఈ సినిమాని 2021లోనే విడుదల చేస్తారా నాని? తన రెండు సినిమాల మధ్య కనీసం నాలుగు నెలలు ఉండేలా చూసుకుంటారు నాని. ‘టక్ జగదీష్’ జులై, ఆగస్టులలో విడుదల కాగలిగితే, ‘శ్యామ్ సింగ రాయ్’ని డిసెంబర్లో రిలీజ్ చేసెయ్యచ్చు.

‘టక్ జగదీష్’ విడుదల ఆలస్యమైతే, ‘శ్యామ్ సింగ రాయ్’ 2021లో విడుదల కాలేదు. ఇక ‘అంటే సుందరానికి’ సంబంధించి చాలా వర్క్ మిగిలే ఉంది. కాబట్టి అదెలాగూ వచ్చే ఏడాదే రిలీజ్ అవుతుంది.

నాని నిర్మాతగా కూడా తన సోదరిని దర్శకురాలిగా పరిచయం చేస్తూ సినిమా నిర్మిస్తున్నారు. అలాగే, మరో రెండు కొత్త సినిమాలను కూడా లైన్లో పెట్టారట. కానీ అవి ఇప్పుడే ప్రకటించే అవకాశం లేదు.

Advertisement
 

More

Related Stories