మళ్ళీ తల్లి కానున్న నేహా ధూపియా

Neha Dhupia

హీరోయిన్ నేహా ధూపియా మరోసారి గర్భం దాల్చింది. 2018లో అంగడ్ బేడీ అనే నటుడిని పెళ్లి చేసుకొంది. పెళ్ళైన ఏడాదికే వీరికి ఒక ఒక కూతురు పుట్టింది. ఇప్పుడు రెండో బేబీకి జన్మనివ్వబోతోంది.

ఈ రోజు ఆమె సోషల్ మీడియా ద్వారా తాను మళ్ళీ గర్భవతిని అని ప్రకటించింది. నేహా ధూపియాకి 40 ఏళ్ళు.

తెలుగులో తరుణ్ నటించిన ‘నిన్నే ఇష్టపడ్డాను’, రాజశేఖర్ సరసన ‘విలన్’ వంటి చిత్రాల్లో నటించింది నేహా ధూపియా. బాలీవుడ్ లో సింగ్ ఈజ్ కింగ్, హే బేబీ వంటి చిత్రాల్లో నటించింది. ఆమె భర్త అంగడి బేడీకి ఇటీవలే కరోనా నుంచి కోలుకున్నారు.

Advertisement
 

More

Related Stories