రాధికకి మాటిచ్చిన మెగాస్టార్!

Radhika Sarathkumar


మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికే పలు సినిమాలు ప్రకటించారు. కొన్ని షూటింగ్ దశలో ఉన్నాయి. కొన్ని తుది దశకు చేరుకున్నాయి. ఇప్పుడు మరో సినిమా ఒప్పుకున్నట్లు టాక్. మెగాస్టార్ చిరంజీవితో అనేక సినిమాల్లో హీరోయిన్ గా నటించిన రాధికా శరత్ కుమార్ కి ఒక సినిమా చేస్తానని మాటిచ్చారట.

ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. ఆమె నిర్మాతగా ఎంతో పేరు గడించారు. బుల్లితెరపై ఆమె సీరియల్స్ సూపర్ హిట్. ఇక తెలుగులో చిరంజీవి హీరోగా ఒక సినిమా నిర్మించాలనేది ఆమె కోరిక. రాధిక వెళ్లి అడగ్గానే ఆయన “ఓ ఎస్ చేసేద్దాం” అని చెప్పారట.

చిరంజీవి, రాధిక హీరో, హీరోయిన్లుగా “న్యాయం కావాలి”, “అభిలాష”, “దొంగమొగుడు” వంటి హిట్ సినిమాలున్నాయి. వీరి కాంబినేషన్ లో దాదాపు 15, 16 చిత్రాలు వచ్చాయి. చిరంజీవి కుటుంబంతో ప్రత్యేక అనుబంధం ఉంది రాధికకి. ఆ స్నేహం కోసం ఆమె నిర్మాతగా ఒక సినిమా చేస్తానని చిరంజీవి చెప్పారట.

ప్రస్తుతం ఆయన “గాడ్ ఫాదర్”, “భోళా శంకర్”, “వాల్తేర్ వీరయ్య” సినిమాలు చేస్తున్నారు. అలాగే, వెంకీ కుడుముల దర్శకత్వంలో ఒక సినిమా చెయ్యనున్నారు. ఇవి అయిపోయాక రాధిక నిర్మాణంలో సినిమా ఉండే అవకాశం ఉంది.

Advertisement
 

More

Related Stories