బాలీవుడ్ లో సంకల్ప్ రెడ్డి చిత్రం

రానాతో ‘ఘాజి’ సినిమా తీసి మంచి పేరు తెచ్చుకున్న యువ దర్శకుడు సంకల్ప్ రెడ్డి. ఆ తర్వాత ‘అంతరిక్షం’ అని స్పేస్ డ్రామా తీశారు కానీ అది ఆడలేదు. తర్వాత నెట్ ఫ్లిక్స్ నిర్మించిన ‘పిట్టకథలు’ సిరీస్ లో ఒక స్టోరీ డైరెక్ట్ చేశారు. ఇప్పుడు బాలీవుడ్ లోకి ఎంట్రీ.

సంకల్ప్ రెడ్డి మొదటి హిందీ చిత్రం ఖరారు అయింది. బాలీవుడ్ హీరో విద్యుత్ జమ్వాల్ ఈ సినిమాలో హీరో. ఆయనే నిర్మాత కూడా. సంకల్ప్ సినిమాలు చూసి, అతని చెప్పిన కథ నచ్చి విద్యుత్ ఈ సినిమా నిర్మించేందుకు ముందుకు రావడం విశేషం. ఈ సినిమాకి “ఐబీ 71” అనే టైటిల్ ఫిక్స్ అయింది.

‘జెర్సీ’ సినిమాతో గౌతమ్ తిన్ననూరి బాలీవుడ్ లోకి అడుగుపెడుతున్నారు. ఇప్పటికే ‘కబీర్ సింగ్’తో సందీప్ వంగా బాలీవుడ్ లో పెద్ద దర్శకుడిగా సెటిలయ్యారు. అలాగే, ‘హిట్’ హిందీ రీమేక్ తో శైలేష్ అనే మరో తెలుగు దర్శకుడు కూడా పరిచయం కానున్నాడు బాలీవుడ్ కి. ఇప్పుడు సంకల్ప్ రెడ్డి జాయిన్ అవుతున్నారు ఈ లిస్ట్ లోకి.

సంకల్ప్ రెడ్డి అన్ని భిన్నమైన చిత్రాలు చేస్తారు. ఈ కుర్ర దర్శకుడు విదేశాల్లో ఫిలింమేకింగ్ నేర్చుకొని వచ్చారు. మరి సంకల్ప్ కూడా సందీప్ వంగాలా బాలీవుడ్ లో విజయం సాధిస్తారా అన్నది చూడాలి.

Advertisement
 

More

Related Stories