కొడుకుల కెరీర్ గురించి…!

Sunitha and Suma Kanakala

సుమ కనకాల… ప్రస్తుతం తెలుగులో టాప్ యాంకర్. ఏ పెద్ద సినిమా ప్రోగ్రాం అయినా ఆమె ఉండాల్సిందే. ఒక్క షోకి దాదాపు 5 లక్షలు తీసుకునే టాప్ యాంకర్ సుమ. ఆమె ఇలా షోలతో కోట్లు సంపాదించింది. ఇంకా ఎర్న్ చేస్తోంది. ఐతే, ఇప్పుడు ఈ షోలతో పాటు ఆమె ఫోకస్ తన కొడుకు కెరియర్ పై నిలిపింది.

సుమ కొడుకు రోషన్ కనకాల హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఆమె కొడుకు చిత్రం “బబుల్ గమ్” విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా టీజర్ ఇటీవలే విడుదలైంది. ఈ సినిమా ప్రమోషన్ బాధ్యతని సుమ తన నెత్తినెట్టుకొంది. సుమ కనకాల హీరోయిన్ గా సక్సెస్ కాలేదు. దాంతో ఆమె బుల్లితెరకు షిఫ్ట్ అయింది. యాంకర్ గా స్థిరపడింది. ఆమె భర్త రాజీవ్ కనకాల కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పేరు తెచ్చుకున్నారు. కానీ, తన కొడుకుని మాత్రం హీరోగా నిలబెట్టాలి అనుకుంటోంది సుమక్క.

గాయని సునీత ఇటీవల రెండో పెళ్లి చేసుకున్నారు. మొదటి భర్త ద్వారా ఆమెకి ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు. కొడుకు ఆకాష్ హీరోగా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. ఆకాష్ గోపరాజు మొదటి చిత్రం … “సర్కార్ నౌకరి”. ఈ సినిమా కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. సునీత ఈ సినిమాని ప్రమోట్ చేసే బాధ్యత తీసుకున్నారు.

అలా సుమ, సునీత ఇప్పుడు తమ కెరీర్లు కన్నా తమ కొడుకుల కెరీర్లపై ఎక్కువ ఫోకస్ పెట్టారు.

Advertisement
 

More

Related Stories