కథలకు పురాణల, దేవతల కనెక్షన్!

Devotional movies

తెలుగు సినిమాలు పూర్తిగా దేవతలు, పురాణాలు, దైవభక్తి వంటి అంశాలతో రూపొందుతున్నాయి. చిన్న సినిమా అయినా, పెద్ద సినిమా అయినా ‘డివోషనల్’ ఎలిమెంట్ తప్పనిసరి అయింది. ఈ ఏడాది అతిపెద్ద హిట్ చిత్రం… హనుమాన్. ఈ సినిమా జానర్ …సూపర్ మేన్. కానీ సినిమాలో వర్కవుట్ అయింది, సూపర్ హిట్ అయింది హనుమంతుడి ప్రస్తావన వల్లే.

ఇక శివరాత్రి నాడు విడుదలైన రెండు సినిమాల్లో కూడా “స్పిరుచ్వల్” యాంగిల్ ఉంది. గోపీచంద్ హీరోగా నటించిన “భీమా”లో పరుశరాముడు క్షేత్ర ప్రస్తావన ఉంది. ఒక గుడి చుట్టూ కథలో ప్రధాన భాగం ఉంది. విశ్వక్ సేన్ నటించిన “గామి”లో కాశీ నగరం, హిమాలయాల ప్రస్తావన ప్రధానం. హిందూ కర్మ సిద్ధాంతం సినిమాలో ముఖ్యమైన అంశం.

త్వరలో విడుదల కానున్న “ఓదెల 2” అనే సినిమాలో తమన్న సాధ్విగా నటిస్తోంది. ఆమె పాత్ర పూర్తిగా భక్తిభావంతో కూడినదే. సినిమా కూడా ఓదెల మల్లన్న స్వామి ప్రాశస్త్యం చుట్టూ తిరుగుతుంది.

ప్రభాస్ హీరోగా రూపొందుతోన్న “కల్కి” చిత్ర కథ మహాభారత కాలం నుంచి మొదలవుతుంది. సినిమా మొత్తం కాశీ నేపథ్యంగా సాగుతుంది. ఇందులో హీరో ప్రభాస్ పేరు భైరవ. కాలభైరవుడి కనెక్షన్.

ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల తీస్తున్న “కుబేర” చిత్రం మొదటి లుక్ లో కూడా శివుడు, అన్నపూర్ణాదేవి ప్రస్తావన ఉంది. మంచు విష్ణు తీస్తున్న “కన్నప్ప” కూడా గొప్ప శివ భక్తుడి కథే. మొత్తమ్మీద, తెలుగు సినిమా దర్శక, నిర్మాతలు మళ్ళీ భక్తి మార్గం పట్టారు.

Advertisement
 

More

Related Stories