బాలీవుడ్ లోకి ‘ఆకాశం నీ హద్దురా’


సూర్య నటించిన ‘ఆకాశం నీ హద్దురా’ పెద్ద హిట్ అయింది. గతేడాది డైరెక్ట్ గా అమెజాన్ లో విడుదలైంది ఆ మూవీ. అయినా కూడా ప్రేక్షకుల స్పందన అదిరిపోయింది. అమెజాన్ కి కూడా వ్యూహర్షిప్ అదిరిపోయిందట. ఇప్పుడు ఈ సినిమాని హిందీలో రీమేక్ చేస్తున్నట్లు ప్రకటించారు సూర్య.

సూర్య, జీవిత, రాజశేఖర్ పాండియన్ కలిసి ఈ సినిమాని హిందీలో రీమేక్ చేస్తారు. హీరో ఎవరు అనేది ఇంకా ఫిక్స్ కాలేదు. కానీ దర్శకురాలు మాత్రం సేమ్. ఒరిజినల్ డైరెక్టర్ సుధ కొంగర బాలీవుడ్ లో కూడా రీమేక్ చేస్తారు.

ఇటీవల తెలుగు, తమిళ్ సినిమాలను హిందీలో సౌత్ డైరెక్టర్లతో రీమేక్ చేసే ట్రెండ్ పెరిగింది. ‘అర్జున్ రెడ్డి’ సినిమాని సందీప్ వంగ హిందీలో ‘కబీర్ సింగ్’గా విజయవంతంగా రీమేక్ చేశాడు. ఇప్పుడు ‘జెర్సీ’ సినిమాని హిందీలో గౌతమ్ తిన్ననూరి తీస్తున్నాడు. అలాగే, ‘హిట్’ సినిమాని శైలేష్ కొలను హిందీలో తనే రీమేక్ చేస్తున్నాడు.

Advertisement
 

More

Related Stories