AP

NTR Biopic: Trade in a state of shock

Allu Arjun now getting inspiration from Pawan Kalyan

హోదా కోసం గ‌డ్డం క‌ట్‌

ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు అన‌గానే తెల్లగ‌డ్డంతో కూడిన రూపం గుర్తొస్తుంది. ఎపుడూ గ‌డ్డంతోనే ఉంటారాయ‌న‌. ఐతే ఇపుడు ద‌ర్శ‌కేంద్రుడు త‌న గడ్డాన్ని ప్ర‌త్యేక హోదాకి అర్పించారు. హోదా వ‌చ్చేలా చేయ‌మ‌ని  తిరుప‌తి వెంక‌టేశ్వ‌రుడిని మొక్కుకున్నారాయ‌న‌.

సాధార‌ణంగా మొక్కు తీరిన త‌ర్వాత త‌ల‌నీలాలు స‌మ‌ర్పిస్తారు భ‌క్తులు. ద‌ర్శ‌కేంద్రుడు మాత్రం ముందే స‌మ‌ర్ప‌యామి అన్నారు. ఇది రివ‌ర్స్ మొక్కు.  ప్రత్యేకహోదా పోరాటంలో ప్రభుత్వానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని,  త్వరలోనే రాష్ట్ర ప్రజలు శుభవార్త వింటారనే న‌మ్మ‌కం ఉంద‌న్నారు. సోమ‌వారం (ఏప్రిల్ 9న‌) ఆయ‌న త‌న గ‌డ్డాన్ని అర్పించారు.

Rangasthalam: First weekend collections

సినిమా వాళ్లు ఉద్య‌మం చేస్తే మీరేం చేస్తారు?

త‌మిళ‌నాడులో జ‌ల్లిక‌ట్టు ఉద్య‌మం చేసిన‌పుడు అక్క‌డి సినిమా హీరోలంతా వ‌చ్చి మ‌ద్ద‌తిచ్చారు. కొంద‌రు ప్ర‌త్య‌క్షంగా ఉద్య‌మంలో పాల్గొన్నారు. మ‌రి తెలుగు హీరోలు ఏం చేస్తున్నారు?. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేస్తున్నా పట్టించుకోవడం లేదంటూ టాలీవుడ్ తార‌ల‌పై తీవ్రస్థాయిలో తెలుగు దేశం నాయ‌కుడు బాబూ రాజేంద్ర‌ప్ర‌సాద్ విమర్శలు చేశారు. ఉద్యమించకపోతే ఆంధ్రులు సినీ పరిశ్రమను వెలివేస్తారని రాజేంద్ర ప్రసాద్‌ హెచ్చరించారు.

Pawan Kalyan's house being constructed in Guntur

Agnyaathavaasi to break BB2 record on Day1?

కేసీఆర్‌, ప‌వ‌ర్‌స్టార్ భేటీ వెనుక స్పెష‌ల్ రీజ‌న్ ఉందా?

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎపుడూ స‌ర్‌ప్రైజ్‌లు ఇస్తూనే ఉంటారు. కొత్త సంవ‌త్స‌రం తొలి రోజు తెలంగాణ ముఖ్య‌మంత్రి కె.చంద్ర‌శేఖ‌ర‌రావుతో జ‌న‌సేన అధినేత గంట‌న్న‌ర‌ సేపు భేటీ కావ‌డం అతిపెద్ద స‌ర్‌ప్రైజ్‌. ఈ భేటి ఏపీ, తెలంగాణ రాజ‌కీయ వ‌ర్గాల్లో క‌ల‌క‌లం రేపింది. 

కేసీఆర్‌తో ప‌వ‌ర్‌స్టార్‌కి ఇంత‌కుముందు ప్ర‌త్యేక‌మైన స్నేహ‌బంధం లేదు. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ, ఆ త‌ర్వాత కూడా కేసీఆర్ పార్టీకి వ్య‌తిరేకంగానే ప్ర‌చారం చేశారు ప‌వ‌ర్‌స్టార్‌. ఐతే ఇపుడు స‌డెన్‌గా క‌ల‌వడం వెనుక ఏదైనా వ్యూహం ఉందా? అస‌లు ప‌వ‌న్ క‌ల్యాణ్ కేసీఆర్‌ని ఎందుకు క‌లిశారు? అస‌లు రీజ‌న్ ఏంటి

లోకేష్‌పై పోసాని ఫైర్‌, నంది వాప‌సు

నంది అవార్డుల వివాదం ఇంకా స‌ద్దుమ‌ణ‌గ‌డం లేదు. ప్ర‌ముఖ న‌టుడు, ర‌చ‌యిత త‌న‌కి వ‌చ్చిన నందిని వాప‌సు ఇచ్చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. టెంప‌ర్ సినిమాలో న‌ట‌న‌కిగాను ఆయ‌న‌కి ఉత్త‌మ స‌హాయ న‌టుడు అవార్డు ద‌క్కింది. అయితే తాను క‌మ్మ‌వాడిని కాబ‌ట్టే ఈ అవార్డు ఇచ్చారని అంద‌రూ అంటున్నార‌ని, ఇది నాకు సిగ్గుచేటు అని మండిప‌డ్డారు పోసాని. ప్ర‌భుత్వం చేసిన త‌ప్పుడు నిర్ణ‌యాల వ‌ల్ల నంది అవార్డుల ప్ర‌తిష్ట మ‌స‌క‌బారింద‌ని అన్నారు పోసాని.

DJ : AP & TS First week collections

Pages

Subscribe to RSS - AP