చైతన్య నటుడిగా ఎదుగుతాడు: అమీర్


బాలీవుడ్ అగ్రహీరో అమీర్ ఖాన్ నిన్న తన 57వ పుట్టిన రోజు సెలెబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో అనేక విషయాలు పంచుకున్నారు. ముఖ్యంగా తన పెళ్లిళ్ల గురించి, తన ఆల్కహాల్ హ్యాబిట్స్ గురించి నిర్మోహమాటంగా మాట్లాడారు.

– ఒకప్పుడు ఫుల్ బాటిల్ లేపేవాడిని. కానీ, ఇప్పుడు మొత్తం తాగుడు మానేశా. ఆల్కహాల్ సేవనం బంద్.

– చాలామందికి ఒక డౌట్ ఉంది…. నేను, నా మొదటి భార్య, నేను నా రెండో భార్య ఇంకా ఎలా కలిసి స్నేహంగా ఉంటున్నామో అర్థం కావడం లేదని చాలా మంది అంటున్నారు. మేమంతా ఒకే కుటుంబం. అందరం కలిసే ఉంటాం.

Aamir Khan and Kiran Rao

– నా మొదటి భార్య రీనా విడిపోయినా ఇంకా నా కుటుంబంతో కలిసే ఉంది. ఆమె సోదరుడిని నా చెల్లెలు పెళ్లి చేసుకొంది. నేను నెలకొల్పిన పానీ ఫౌండేషన్ లో ఆమె కీలక సభ్యురాలు.

నేను, నా రెండో భార్య కిరణ్ రావు గతేడాది భార్యాభర్తలుగా విడిపోయాం. కానీ, స్నేహితులుగా కలిసే ఉంటున్నాం. ఆమె నా ఇంటి పైనే ఉంటుంది. కిరణ్ రావు తల్లితండ్రులు, సోదరులు అందరూ మాతో ఇప్పటికే అదే బంధాలు కొనసాగిస్తారు.

Aamir Khan and Naga Chaitanya
  • లాల్ సింగ్ చద్దా’ ఆగస్టులో విడుదల అవుతుంది. నాగ చైతన్య బాగా నటించాడు. అతను మంచి నటుడిగా ఎదుగుతాడు.
Advertisement
 

More

Related Stories