ఛార్మి @ 35!

Charmme


హీరోయిన్ ఛార్మికిప్పుడు 35 ఏళ్ళు. ఈ రోజు 35వ బర్త్ డే జరుపుకుంటున్నాను అని ఒక ఫోటో షేర్ చేసింది.

చిన్నప్పుడు అంటే.. 14 ఏళ్ల వయసులోనే ఆమె సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. హీరోయిన్ గా రెండు దశాబ్దాల కెరీర్ పూర్తి చేసుకొంది. కానీ వయసు పరంగా ఇంకా 35.

ఆమె ఇప్పుడు హీరోయిన్ గా నటించడం మానేసింది. పూర్తిగా నిర్మాతగానే కెరీర్ కంటిన్యూ చేస్తోంది. పూరి జగన్నాధ్ స్థాపించిన పూరి కనెక్ట్స్ లో ఆమె భాగస్వామి. ‘ఇస్మార్ట్ శంకర్’కి సీక్వెల్ ని తాజాగా అనౌన్స్ చేశారు పూరి, ఛార్మి. సో, మళ్ళీ వీళ్ళు షూటింగ్ తో బిజీగా మారుతున్నారు.

“లైగర్” ఫ్లాప్ తర్వాత పూర్తిగా సైలెంట్ అయిన ఈ జంట ఇక మళ్ళీ “డబుల్ స్మార్ట్” అనే కొత్త సినిమాతో లైంలైట్ లోకి వస్తారు. రామ్ హీరోగా నటించనున్నాడు ఈ సీక్వెల్లో.

Advertisement
 

More

Related Stories