సోషల్ మీడియాలో దేవాకి ప్రశంసలు!

Deva Katta

దర్శకుడు దేవా కట్టా తీసిన ‘రిపబ్లిక్’ గత వారం విడుదలయింది. ఈ సినిమాకి విమర్శకులు మిశ్రమ రేటింగ్ ఇచ్చారు. కానీ, విడుదలనప్పటి నుంచి సోషల్ మీడియాలో మాత్రం దేవా కట్టాకి కాంప్లిమెంట్స్ ఎక్కువగా లభిస్తున్నాయి. నేటి రాజకీయాలను ప్రతిబింబించేలా సినిమా ఉందని మెచ్చుకుంటున్నారు.

ముఖ్యంగా డైలాగ్ లకు సూపర్ రెస్పాన్స్ వస్తున్నట్లు సోషల్ మీడియా పోస్టులు తెలియచేస్తున్నాయి. సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన ఈ మూవీ ఒక పొలిటికల్ డ్రామా. కొల్లేరు సరస్సు కాలుష్యం నేపథ్యంగా సాగే కథ. సాయి ధరమ్ తేజ్ కలెక్టర్ పాత్ర పోషించాడు. ఈ సినిమా ఒక నిరాశావాదంతో ముగుస్తుంది. ఒక ట్రాజిక్ ఎండింగ్!. ఐతే, నెటిజన్స్ మాత్రం వాస్తవానికి దగ్గరిగా ఉంది ఈ క్లైమాక్స్ అని చెప్తున్నారు. ఈ ఎండింగ్ అదిరిపోయింది అని అంటున్నట్లు కనిపిస్తోంది.

దర్శకుడు దేవా కూడా ప్రతి ట్వీట్ ని రీట్వీట్ చేస్తున్నారు. ఆయన సినిమాకి ఇప్పుడు వస్తున్న రెస్పాన్స్ తో సంతోషంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఇక సినిమా నిర్మించిన వారికి కూడా లాభాలు వచ్చాయి. ముందే ఈ సినిమాని జీ స్టూడియోస్ కి అమ్మేశారు. సో, థియేటర్లో రెవిన్యూతో సంబంధం లేకుండా నిర్మాతలు లాభాల్లోనే ఉన్నారు. ఆ విధంగా దేవా కట్టాకి హెల్ప్ అయినట్లే.

దేవా తన తదుపరి చిత్రం ఏంటో ఇంకా ప్రకటించలేదు.

Advertisement
 

More

Related Stories