కామా, ఫుల్ స్టాప్ కాదు!

Maruthi


ప్రభాస్, దర్శకుడు మారుతి కాంబినేషన్లో సినిమా అంటూ ఆ మధ్య మీడియాలో చాలా హడావిడి జరిగింది. అలాగే, ఈ నెల 10న సినిమాని ప్రారంభిస్తారని కూడా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. కానీ, తాజా సమాచారం ప్రకారం ఈ నెల 10న అలాంటి హడావిడి ఉండదు.

ఇంతే కాదు, ఇప్పట్లో ఈ సినిమా ప్రారంభం అయ్యే సూచనలు కనిపించడం లేదు. అలాగని, వీరి కాంబినేషన్లో మూవీ లేదని కాదు. కానీ, మొదలు కావడానికి ఇంకా టైం పడుతుంది. ప్రస్తుతానికి, ఈ చిత్రానికి బ్రేకులు పడ్డాయి. కామా పెట్టారు, ఫుల్ స్టాప్ కాదు.

ప్రభాస్ చేస్తున్న చిత్రాలు, ఒప్పుకున్న చిత్రాల లిస్ట్ పెద్దది. అందులో ఈ సినిమాని ఎలా సెట్ చెయ్యాలి అనేది ప్రభాస్ ఆలోచిస్తున్నారు. ‘ఆదిపురుష్’ జనవరి 12, 2023న విడుదల కానుంది. ఇక ‘సలార్’ విడుదల విషయంలో క్లారిటీ వస్తే… మారుతి సినిమాని ఎప్పుడు రిలీజ్ చెయ్యాలో ఆలోచించుకొని దానికి తగ్గట్లు షూటింగ్ మొదలు పెడతారట.

ప్రస్తుతానికి మారుతి పకడ్బందీగా స్క్రిప్ట్ ని మలిచే పనిలో బిజీగా ఉన్నారు.

Advertisement
 

More

Related Stories