కంగనాకు ఇన్ స్టాగ్రామ్ లోనూ ఝలక్

Kangana

మతసామరస్యం దెబ్బతినేలా పోస్టులు పెట్టడంతో ట్విట్టర్ వేదికనుంచి ఆమెని బహిష్కరించారు. ట్విట్టర్ ఆమె అకౌంట్ ని శాశ్వతంగా సస్పెండ్ చేసింది. దాంతో ఇన్ స్టాగ్రామ్ కి చేరుకొంది. అక్కడ పోస్టులు పెట్టడం మొదలుపెట్టింది. ఐతే, అక్కడ కూడా ఆమెకి షాక్ తగిలింది.

ఇటీవల కంగనాకి కరోనా సోకింది. ఆ విషయాన్ని తెలుపుతూ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టింది. ఐతే, ఆందులో ఆమె రాసిన కంటెంట్ పై పలువురు అభ్యంతరం ప్రకటించారు. దాంతో, ఇన్ స్టాగ్రామ్ ఆమె పెట్టిన పోస్ట్ ని డిలిట్ చేసింది. ట్విట్టర్ లా ఇన్ స్టాగ్రామ్ ఆమెని బహిష్కరించలేదు కానీ ఆమె పెట్టిన పోస్ట్ ని తొలగించింది.

ఇంతకీ ఆమె రాసిన దాంట్లో అభ్యంతరకరమైన మేటర్ ఏంటంటే….

“కరోనా ఫ్లూ లాంటి చిన్న రోగం. మీడియా ఎక్కువ ప్రచారం చేసి భయపెడుతోంది.”

ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది చనిపోయారు కరోనా వల్ల. నేడు మనదేశం అంతటా… ఆసుపత్రుల్లో బెడ్స్ దొరక్క, ఆక్సిజన్ లేక జనం పిట్టల్లా రాలిపోతున్నారు. అలాంటి మహమ్మారిని కేవలం ‘చిన్న రోగం’ అని జనాలని మిస్ లీడ్ చేసింది కంగనా. దాంతో ఇన్ స్టాగ్రామ్ ఆమె పోస్ట్ ని తొలగించింది.

Kangana Ranaut in a Saree

నన్ను ఇక్కడ కూడా ఇంకో వారం కంటే ఎక్కువ రోజులు ఉండనిచ్చేలా లేరు అంటూ ఇప్పుడు కంగనా వాపోతోంది.

Advertisement
 

More

Related Stories