Jana Sena

తెలంగాణ‌లో పోటీపై రెండ్రోజుల్లో నిర్ణ‌యం!

డిసెంబ‌ర్ 7న తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఇవి ముంద‌స్తు ఎన్నిక‌లు. ఇంత ముంద‌స్తుగా ఎన్నిక‌లు వ‌స్తాయ‌ని ఊహించ‌ని జ‌న‌సేన ఇపుడు పోటీ ప‌డేందుకు త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతోంది. ఈ సారి అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీప‌డ‌ద‌నేది ఖాయంగా తెలుస్తోంది. ఐతే జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ మాత్రం ఇంకా ఏ నిర్ణ‌యం తీసుకోలేదంటున్నారు.  పార్టీలో చర్చించి రెండుమూడు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

ఐతే త‌మ పార్టీ ప్ర‌ధానంగా ఫోక‌స్ ఏపీపైనే పెడుతుంద‌ని స్ప‌ష్టం చేశారు. వ‌చ్చే ఏడాది జ‌రిగే ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కి పూర్తిగా రెడీగా ఉన్నామ‌ని అంటున్నారు.

ఇది పవన్ కల్యాణ్ సినిమా

విజయ్ హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో వచ్చింది "సర్కార్" సినిమా. రాజకీయాల్లోకి అడుగుపెట్టాలనుకుంటున్న విజయ్ కు తమిళనాట ఈ సినిమా బాగా కలిసొస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సంగతి పక్కనపెడితే, రాజకీయాల్లోకి రాకముందు తెలుగులో పవన్ ఇలాంటి సినిమా చేసి ఉంటే బాగుండేదని అభిప్రాయం మాత్రం అంద‌రి నుంచి వినిపిస్తోంది.

జ‌న‌సేనకి అంజ‌నాదేవి విరాళం

జనసేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న త‌ల్లికి త‌న జ‌న‌సేన పార్టీ ఆఫీస్‌ని చూపించారు. హైద‌రాబాద్‌లోని  మాదాపూర్‌లో ఉన్న త‌న పార్టీ ఆఫీస్‌కి ఆమెని తీసుకెళ్లారు. అంజనా దేవి త‌న కుమారుడి పార్టీకి 4లక్షల రూపాయ‌ల విరాళం ఇచ్చారు. ఆ చెక్కును పవన్‌కు పార్టీ ఆఫీస్‌లో అందజేశారు. 

త‌న మాతృమూర్తి నుంచి చెక్ తీసుకున్న వెంట‌నే ఆమె కాళ్లకు నమస్కరించి ఆశీస్సులు తీసుకున్నారు జ‌న‌సేనాని. 

అంజ‌నాదేవి భ‌ర్త కొణిదెల వెంక‌టరావు పోలీసు అధికారిగా ప‌నిచేశారు. ఆయ‌నకి వ‌చ్చిన పెన్షన్ మొత్తాన్నే జనసేన పార్టీకి విరాళంగా అందచేసినట్లు అంజ‌నాదేవి తెలిపారు. 

Pawan Kalyan to align with BSP?

Rumors about Megastar Chiranjeevi surface

Thaman composes Jana Sena's Kavathu song

Pawan's party strengthening in Godavari belt

వాళ్ల‌ని టెన్స‌న్‌ పెడుతోన్న‌ ప‌వ‌ర్‌స్టార్‌

తెలంగాణ ఎన్నిక‌లకి నోటిఫికేష‌న్ వ‌చ్చే నెల మొద‌టి వారంలోనే వ‌స్తుంద‌నేది అంచ‌నా. అందుకే ముందే పొత్తులు కుదుర్చుకునేందుకు అన్ని పార్టీలు త‌హ‌త‌హ‌లాడుతున్నాయి. పాల‌క పార్టీ టీఆర్ఎస్‌ని ఢీకొట్టాలంటే కూట‌మిగా కూడా క‌ష్ట‌మే కానీ క‌నీసం పొత్తులు లేక‌పోతే ముందు చేతులెత్తెసిన‌ట్లు అవుతుంది. అందుకే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకే వ్య‌తిర‌కం అని చెప్పిన సీపీఎం పార్టీ ప‌వ‌ర్‌స్టార్ తో పొత్త కొసం తెగ ట్రై చేస్తోంది.

బండ్ల గ‌ణేష్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌ని తిడుతాడా?

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ నా దేవుడు అంటూ ఎపుడూ ఊగిపోయే బండ్ల గ‌ణేష్ పాలిటిక్స్‌లోకి వ‌చ్చాడు. స‌హ‌జంగానే బండ్ల గ‌ణేష్ ఎర్ర తువ్వాల త‌న మెళ్లో వేసుకుంటాడ‌నుకుంటారు. కానీ ఆయ‌న కాంగ్రెస్ కండువా క‌ప్పుకున్నాడు. జ‌న‌సేన పార్టీలో చేర‌కుండా, కాంగ్రెస్ తీర్థం పుచ్చ‌కున్నాడు. రాహుల్ గాంధీ స‌మ‌క్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరాడు.

Telangana Polls: Pawan Kalyan in dilemma?

Pages

Subscribe to RSS - Jana Sena