పవన్ కళ్యాణ్ నుంచి అప్డేట్లు ఉంటాయా?

Pawan Kalyan


మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు నాడు ఒక రేంజులో రచ్చ సాగింది. మెగాభిమానులు పండగ చేసుకున్నారు. చిరంజీవి పుట్టిన రోజు నాడు “భోళా శంకర్”, “గాడ్ ఫాదర్”, “మెగా 154” చిత్రాల ఫోటోలు, వీడియోలు, టైటిల్ ప్రకటనలు… ఇలా చాలా సందడి చూశాం. ఓకే రెండు రోజులు సోషల్ మీడియాలో హంగామా మాములుగా సాగలేదు.

మరో వారం రోజుల్లో పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు వస్తోంది. పవర్ స్టార్ చేతిలో కూడా పలు సినిమాలు ఉన్నాయి. మరి, ఆయన సినిమాల అప్డేట్ లు ఏ రేంజులో ఉంటాయో చూడాలి.

ఇప్పటికే, దర్శకుడు హరీష్ శంకర్ తన సినిమాకి సంబంధించి పవన్ కళ్యాణ్ తో ఒక ఫోటోషూట్ పూర్తి చేశారు. సెప్టెంబర్ 2న (పవన్ కళ్యాణ్ బర్త్ డే) సినిమా టైటిల్ తో కూడిన పోస్టర్ విడుదల చేద్దామని ప్లాన్ చేస్తున్నారట. అలాగే, క్రిష్ కూడా తన ‘హరి హరి వీరమల్లు’ చిత్రానికి సంబంధించిన అప్డేట్ కూడా రెడీ చేసి పెట్టుకున్నారు. దర్శకుడు సురేందర్ రెడ్డి – నిర్మాత రామ్ తాళ్లూరి పవన్ కళ్యాణ్ తో ప్లాన్ చేస్తున్న సినిమాకి సంబంధించి ఏదైనా హడావిడి ఉంటుందో లేదో తెలీదు కానీ క్రిష్, హరీష్ శంకర్ లు మాత్రం తమ అప్డేట్ లు ఇచ్చేందుకు రెడీగా ఉన్నారు. కాకపోతే, ముందు పవన్ కళ్యాణ్ నుంచి వారికి గ్రీన్ సిగ్నల్ రావాలి.

వీటి సంగతి ఎలా ఉన్నా.. త్రివిక్రమ్ డైలాగులు రాస్తున్న “భీమ్లా నాయక్” సినిమా నుంచి మొదటి పాట విడుదల అవుతుంది. తమన్ స్వరపరిచిన మొదటి పాటని సెప్టెంబర్ 2న విడుదల చేస్తామని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.

త్రివిక్రమ్ ఏమి చెప్పినా పవన్ కళ్యాణ్ కాదనరు కదా. అందుకే, త్రివిక్రమ్ ‘భీమ్లా నాయక్’ అప్డేట్ కి ముందే కర్చీఫ్ వేసి పెట్టారు ఆయన. సో, పవన్ కళ్యాణ్ అభిమానులు ‘భీమ్లా నాయక్’ సాంగ్ తో ఖుషి చేసుకోవచ్చు. మరి మిగతా అప్డేట్ లు ఉంటాయా అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్.

Advertisement
 

More

Related Stories