పరిశీలనలో ప్రగ్యా!

Pragya


టాలీవుడ్ లో మళ్ళీ ఐటెం సాంగ్ లకు క్రేజ్ పెరుగుతోంది. “పుష్ప”, “సలార్”… ఇలా పెద్ద సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ ఉన్నాయి. అలాగే, “ఎఫ్ 3″లో కూడా స్పెషల్ సాంగ్ ని ప్లాన్ చేస్తున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి. తమన్న, మెహ్రీన్ వంటి గ్లామర్ భామలున్నారు ఈ సినిమాలో. “F2″లో ఇద్దరూ బికినీల్లో కావాల్సినంత గ్లామర్ ఒలకబోశారు.

ఇప్పుడు ఈ సీక్వెల్ లో స్పెషల్ సాంగ్ ని ప్లాన్ చేస్తున్నాడట రావిపూడి. పలువురు హీరోయిన్ల పేర్లను పరిశీలించారు. తాజాగా ప్రగ్యా జైస్వాల్ వద్ద చర్చలు ఆగినట్లు టాక్. ఈ అమ్మడు కూడా సులువుగానే ఒప్పుకుంటుంది. ఎందుకంటే ‘అఖండ’ తప్ప పెద్దగా ఇతర సినిమాలు లేవు. ‘అఖండ’లో బాలయ్య సరసన హీరోయిన్ గా నటిస్తోంది.

మరి ప్రగ్యా జైస్వాల్ ఐటెం సాంగ్ కి సైన్ చేస్తుందా లేదా అనేది చూడాలి. ఈ సినిమా షూటింగ్ జులై 1 నుంచి ప్రారంభం కానుంది.

Advertisement
 

More

Related Stories