S S Rajamouli

బాహుబ‌లి 2కి 1500 కోట్లు రావ‌డం ఫేకా?

రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది బాహుబలి-2 సినిమా. తాజాగా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా వసూళ్లు 1500 కోట్ల మార్క్ ను ట‌చ్‌ చేశాయి. అయితే ఈ వసూళ్లన్నీ కల్పితమా..? లెక్కలన్నీ ఫేకా...? కావాలనే కలెక్షన్లు పెంచి చెబుతున్నారా...? ఇప్పటివరకు ఎవరికీ రాని అనుమానాలివి. భారతదేశం మొత్తమ్మీద ఒకే ఒక్కడికి వచ్చిన అనుమానం కూడా ఇదే. ఆ ఒక్కడే కమల్ ఆర్.ఖాన్.

US: Radha and Venkatapuram flop, BB2 crosses $19m

దంగల్ ను దాటేసిన బాహుబలి 2

అంతా ఊహించినట్టే జరిగింది. 2 వారాలు గడిచేసరికి ఇండియా వైడ్ రికార్డుల్ని బాహుబలి-2 సినిమా తుడిచిపెట్టేస్తుందని అంతా ఊహించారు. ఇప్పుడదే జరిగింది. ఇండియావైడ్ సరికొత్త రికార్డు సృష్టించింది ఈ సినిమా. అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా అవతరించింది.

Baahubali 2 becomes No.1 Hindi movie

BB2 crosses Rs 150 Cr mark in AP and TS

బాహుబలి 2 : లేటెస్ట్ కలెక్షన్లు (12 రోజులు)

ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజైన బాహుబలి-2 సినిమా ప్రతి ఏరియా నుంచి కళ్లుచెదిరే కలెక్షన్లు సాధిస్తోంది. ఈ సినిమాకు వస్తున్న వసూళ్లు చూసి ట్రేడ్ పండిట్స్ కూడా కళ్లుతేలేస్తున్నారు. ఇప్పటికే వెయ్యి కోట్ల క్లబ్ లోకి చేరిన ఈ సినిమా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి రికార్డు స్థాయిలో వసూళ్లు సాధిస్తోంది. మరీ ముఖ్యంగా తెలంగాణలో ఈ సినిమా చరిత్ర సృష్టించింది. నైజాంలో ఫస్ట్ టైం 50కోట్ల షేర్ క్లబ్ క్రియేట్ చేసింది బాహుబలి-2. ఇప్పటివరకు ఇంత షేర్ అందుకున్న సినిమా ఇంకోటి రాలేదు. విడుదలైన 12 రోజుల్లో ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 151.90 కోట్ల రూపాయల షేర్ రాబట్టింది.

అవును.. మూడు లేదు!

బాహుబలి 3 గురించి ర‌క‌ర‌కాల ఊహాగానాలు. బాహుబ‌లి 2కి మ‌రింత హైప్ రావాల‌ని ఆ సినిమా టీమ్ ఎన్నో ఫీల‌ర్లు వ‌దిలింది. రిలీజ్ త‌ర్వాత బాహుబ‌లి 3 అనే స్పెక్యులేష‌న్‌కి తెర‌లేపింది. 1000 కోట్ల క‌లెక్ష‌న్ వ‌చ్చిన త‌ర్వాత‌...అబ్బే అదంతా ఉత్తిదే అని క్లారిటీ ఇచ్చింది.  

బాహుబలి సినిమాకు పార్ట్ 3 ఉండదని కథా రచయిత విజయేంద్రప్రసాద్ తేల్చిచెప్పేశారు. బాహుబ‌లి 3 ఉండ‌దు కానీ ఆ సినిమా పేరు మీద‌, ఆ మూవీ సెట్ మీద బాహుబ‌లి మేక‌ర్స్‌కి మాత్రం ఇంకా చాలా ర‌కాలుగా సంపాద‌న వ‌స్తూనే ఉంటుంది. ఆ రేంజ్‌లో ఆల్రెడీ వారు అంతా ప‌క‌డ్బందీ స్కెచ్ వేసి పెట్టారు. 

ఫ్రీగా ప‌బ్లిసిటీ కొట్టేసిన శోభు, దేవినేని

పైసా ఖ‌ర్చు పెట్ట‌కుండా మీడియా అదే ప‌నిగా మన సినిమాకి పబ్లిసిటీ చేయ‌డం ఎలా?
ఈ టెక్నిక్ ఓన్లీ శోభు యార్ల‌గ‌డ్డ‌, ప్ర‌సాద్ దేవినేనికే తెలిసిన విద్య‌.  బాహుబ‌లి నిర్మాత‌లు వీరు. వారిద్ద‌రూ దీనిమీద ఏకంగా బుక్ కూడా విడుద‌ల చేసి, దాని మీద కూడా మ‌నీ సంపాదించొచ్చు.. రాజ‌మౌళి తీసిన బాహుబ‌లి 2కి దేశ‌మంత క్రేజ్ వ‌చ్చింది. ఒక సినిమాకి ఎంత క్రేజ్ వ‌చ్చినా, అందులో ఎంత పెద్ద సూప‌ర్‌స్టార్ న‌టించినా..ఆ సినిమాకి యాడ్స్ రూపేణా ఎంతో కొంత ఖ‌ర్చు పెట్టాలి. టీవీల‌లో ప్రోమోల‌కి మనీ పే చెయ్యాలి. న్యూస్‌పేప‌ర్‌ల‌లో యాడ్ వెయ్యాలి.

Baahubali 2 US distributor enters into profit zone

Baahubali 2 gets 13.9 million dollars

Pages

Subscribe to RSS - S S Rajamouli