పోర్న్ కేసులోషెర్లిన్ చోప్రాకు సమన్లు

Sherlyn Chopra

పోర్న్ చిత్రాల కేసులో పలువురు పేర్లు బయటకు వస్తున్నాయి. తాజాగా హీరోయిన్ షెర్లిన్ చోప్రాకు సమన్లు అందాయి. ఈ భామ రాజ్ కుంద్రా నడిపిన యాప్స్ కోసం నీలిచిత్రాలు చేసిందట. అంటే అందులో నటించిందనే ఆరోపణలున్నాయి. మంగళవారం షెర్లిన్ చోప్రా క్రైమ్ బ్రాంచ్ పోలీసుల ముందు హాజరు కావాలి.

రాజ్ కుంద్రాకు వ్యతిరేకంగా తాను ఇంతకుముందే మాట్లాడానని చెప్తోంది షెర్లిన్. తాను తప్పు చెయ్యలేదని పేర్కొంది.

షెర్లిన్ చోప్రాకి శృంగార చిత్రాల కథానాయికగా పేరుంది. పూనమ్ పాండే, షెర్లిన్ చోప్రాల సోషల్ మీడియా ఖాతాల నిండా అసభ్య ఫోజులు ఉంటాయి. ఐతే, వీడియో యాప్స్ కోసం పలువురు హీరోయిన్లు నగ్నంగా నటిస్తున్నారు అని చాలా కాలంగా కామెంట్స్ వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కరోనా లాక్డౌన్ టైంలో ఈ ట్రెండ్ మరింత ముదిరింది.

షెర్లిన్ చోప్రా తెలుగులో “ఏ ఫిలిం బై అరవింద్”, “సంథింగ్ స్పెషల్” వంటి చిత్రాల్లో నటించింది. ఇది 15 ఏళ్ల క్రితం ముచ్చట. ఆ తర్వాత బాలీవుడ్ కి వెళ్లి ఐటెం సాంగ్స్, శృంగార చిత్రాల్లో నటించింది. సినిమాల్లో కన్నా సోషల్ మీడియాలో ఆమె పెట్టే పోస్ట్స్ బాగా పాపులర్. హిందీలో ‘బిగ్ బాస్ 3’లో కూడా పాల్గొంది.

Advertisement
 

More

Related Stories