అది తప్ప అన్నీ చేస్తా: శృతి

శృతి హాసన్ ప్రస్తుతం శాంతను హజారికా అనే ఆర్టిస్ట్ తో సహజీవనం చేస్తున్న విషయం మన అందరికి తెలుసు. ఆమె తన ప్రేమ వ్యహారాలను ఎప్పుడూ దాచుకోలేదు. పైగా, ఈ కొత్త బాయ్ ఫ్రెండ్ తో కొన్ని ఫన్నీ వీడియోలను చాలా సార్లు చేసింది. ప్రేమ లేనిది జీవితం వృధా అనేది ఈ అమ్మడి భావన. మరి ప్రేమ కోసం, ప్రియుడి కోసం ఏదైనా చేస్తుందా?

“ఒక్కటి తప్ప ఏదైనా చేస్తాను. పాములను ముట్టుకోమని అడిగితే చచ్చినా చెయ్యను. అసలు ఆ ఆలోచన వస్తేనే ఒళ్ళు జలదరిస్తుంది,” అని చెప్పింది లేటెస్ట్ ఇంటర్వ్యూలో.

అలాగే, ఇంతవరకు తాను ఎప్పుడూ మొబైల్ డేటింగ్ యాప్ లలో రిజిస్టర్ కాలేదు అని అంటోంది. డేటింగ్ కి వెళ్ళడానికి యాప్ లలో వెతుక్కోవాల్సిన అవసరం రాలేదట.

శృతి మరో విషయం కూడా చెప్పింది. “వంట బాగా చేస్తాను. మా నాన్నమ్మ చెప్పిన సాంబార్ రెసిపీ నేను చేసే వాటిలో బెస్ట్. కుకింగ్ బాగా వస్తుంది కానీ బేకింగ్ ఇంకా రాలేదు.”

Advertisement
 

More

Related Stories