తల్లి కాబోతున్న సోనమ్

Sonam Kapoor


సోనమ్ కపూర్… మన తెలుగువారికి అంతగా తెలియదు కానీ బాలీవుడ్ లో మంచి పాపులారిటీ పొందిన హీరోయిన్. ఫ్యాషన్ కి మారుపేరు అనిపించుకున్న ఈ బ్యూటీ తల్లి కాబోతోంది. సోమవారం తన ఇన్ స్టాగ్రామ్ వేదిక ద్వారా ఈ ఆనందాన్ని తన అభిమానులతో పంచుకొంది.

Advertisement

“నాలుగు చేతులు
నిన్ను గొప్పగా పెంచడానికి కలిశాయి
రెండు హృదయాలు
ఇక నీ చప్పుడుతో సాగుతాయి
ఒక్క కుటుంబం
నిన్ను ప్రేమలో ముంచెత్తుతుంది
నీకు స్వాగతం పలికేందుకు ఆగలేకుండా ఉన్నాం..”

ఈ మాటలతో తన ప్రెగ్నన్సీ ఫోటోలను షేర్ చేసింది సోనమ్ కపూర్. మాతృత్వపు మధురిమని చూడబోతున్నట్లు ప్రకటించింది.

ఆమె భర్త ఆనంద్ అహుజా కూడా ఫొటోలో ఉన్నారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ కూతురు సోనమ్. 2018లో ఆమె ఆనంద్ అహుజాని పెళ్లాడింది. పెళ్లి చేసుకున్నాక సినిమాలు తగ్గించింది.

ఢిల్లీ 6, రాంఝానా వంటి చిత్రాల్లో నటించిన సోనమ్ కపూర్ ఇటీవల ‘బ్లైండ్’ థ్రిల్లర్ కూడా చేసింది. అది విడుదలకు సిద్ధంగా ఉంది.

Advertisement
 

More

Related Stories