పుష్ప, ఆచార్య… కాపీ కథలా?

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న “ఆచార్య” సినిమా కథ నాదే అంటూ ఒక రచయిత… తెలుగు రచయితల సంఘానికి పిర్యాదు చేశాడు. రాజేష్ మండూరి అనే రైటర్ తాను రాసుకున్న కథని రెండేళ్ల క్రితం మైత్రి మూవీ సంస్థకి వినిపించాను అని అంటున్నారు. మైత్రి సంస్థకి, దర్శకుడు కొరటాల శివకి ఉన్న లింక్ అందరికి తెలుసు. మైత్రి సంస్థ … తన కథని కొరటాల శివకి ఇచ్చి ఉంటుంది అనేది రాజేష్ ఆరోపణ.

ఇప్పటికే రచయితల సంఘం తన ఫిర్యాదుని స్వీకరించి, ఆ తర్వాత కొరటాల శివకి అనుకూలంగా, ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందంటున్నాడు రాజేష్. ఇది “ఆఫిసియల్”గా జరుగుతున్న గొడవ. కొరటాల దీనిపై ఇంతవరకు స్పందించలేదు.

ఇక, లేటెస్ట్ గా వేంపల్లి గంగాధర్ అనే కథా రచయిత డైరెక్టర్ సుకుమార్ పై ఇన్ డైరెక్ట్ గా ఒక ఆరోపణ చేశారు. “సాక్షి” పత్రికలో పబ్లిష్ అయినా తన “తమిళ కూలి” అనే కథని లేపేసి, సుకుమార్ “పుష్ప” తీసున్నారు అనేది ఆ రైటర్ అనుమానం. దానికి ఎటువంటి ఆధారం లేదు. ఎందుకంటే… సుకుమార్ కథ ఏంటో గంగాధర్ చదివిన దాఖలాలు లేవు. సినిమా షూటింగ్ ఇంకా మొదలు కాలేదు. కాకపోతే, ఎర్ర చందనము దొంగలు, స్మగ్గ్లింగ్ నేపథ్యంలో సాగే స్టోరీ…. “పుష్ప”. కేవలం ఎర్ర చందనం దొంగల కథ తీస్తున్నంత మాత్రాన అది కాపీ అనడానికి లేదు.

కాకపోతే, అటు సుకుమార్, ఇటు కొరటాల కథాచౌర్యం ఆరోపణలు ఎదుర్కుంటున్నారు.

Advertisement
 

More

Related Stories