ప్రభాస్ ‘యాక్షన్’ కూడా ఉంది!

Prabhas


‘రాధేశ్యామ్’ ట్రైలర్ చూస్తేనే అర్థమైంది… ఈ సినిమాలో ఒక్క ఫైట్ కూడా ఉండదు అని. పూర్తిగా రొమాంటిక్ లవ్ స్టోరీ అనిపిస్తోంది కదా. కానీ అది పొరపాటు. ఈ సినిమాలో కూడా ‘యాక్షన్’ ఉంటుంది. అంటే… ‘సాహో’ టైపు ఫైటింగ్ సీన్లు, రేసులు ఉండవు.

కానీ, భూకంపం, సునామి వచ్చినప్పడు హాలీవుడ్ సినిమాల్లో ఉండే “యాక్షన్” ఇందులో ఉంటుంది. అనేక హాలీవుడ్ చిత్రాలకు పని చేసిన స్టంట్ కొరియోగ్రాఫర్ నిక్ పాల్  ఈ సినిమాకి పనిచేశారు. అంటే, పూర్తిగా ప్రేమించుకోవడాలు, పాటలు పాడుకోవడాలు మాత్రమే ఉంటాయి అనుకోవద్దు. ప్రభాస్ సినిమా అంటే “యాక్షన్” లేకపోతే ఎలా?

ఇక, ఈ సినిమాలో రొమాంటిక్ సీన్లు కూడా డిఫెరెంట్ గా ఉంటాయట. ప్రభాస్, పూజ హెగ్డే మధ్య కిస్ సీన్ కూడా ఉందని టాక్. ఐతే, అది రియల్ గా చిత్రీకరించలేదు. కెమెరా ట్రిక్ తో సాధించారు. ఈ సినిమాకి సగానికి పైగా ఖర్చు గ్రాఫిక్స్ కి, సెట్స్ కి అయింది. ముఖ్యంగా విజువల్ బ్యూటీ కోసం చేసిన ఎఫెక్ట్స్ కి డబ్బు, సమయం ఎక్కువ వెచ్చించారు అని చెప్పొచ్చు.

ప్రభాస్ ఈ సినిమా హిందీలో బాగా ఆడుతుందని ధీమాగా ఉన్నారు.

Advertisement
 

More

Related Stories