అమితాబ్ తో మళ్ళీ దీపిక

Deepika Padukone

లెజండరీ యాక్టర్ అమితాబ్ బచ్చన్ తో దీపిక పదుకోన్ వరుసగా సినిమాలు చేస్తోంది. ఇంతకుముందు వీరు తండ్రి, కూతుళ్లుగా నటించారు. ఆ సినిమా “పీకూ”. అలాగే ప్రభాస్ హీరోగా రూపొందుతోన్న “కల్కి 29898AD” సినిమాలో కూడా దీపిక, అమితాబ్ కలిసి నటిస్తున్నారు.

ఇక ఇప్పుడు అమితాబ్ గురువుగా, అతనికి ఇంటెర్న్ (శిష్యురాలు)గా దీపిక నటించనుంది. ఈ సినిమా పేరు కూడా “ఇంటెర్న్.” అదే పేరుతో గతంలో వచ్చిన ఒక హాలీవుడ్ చిత్రానికిది రీమేక్.

వేయిరి కాంబినేషన్ లో ఈ సినిమాని ప్రకటించి చాలా కాలమే అయింది. ఆ తర్వాత దాని గురించి ఊసులేదు. దాంతో ఈ సినిమా ఆగిపోయింది అని ప్రచారం జరిగిన మాట వాస్తవమే.

ఇప్పుడు పట్టాలెక్కేందుకు అంతా సిద్ధమవుతోంది. వచ్చే నెల షూటింగ్ ప్రారంభం అవుతుందట.

Advertisement
 

More

Related Stories