AP టికెట్‌ రేట్ల జీవో రద్దు

Ticket Rates


సినిమా టికెట్ ధరల్ని తగ్గిస్తూ ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తెచ్చిన జీవోని హైకోర్టు రద్దు చేసింది. ఆ జీవో చెల్లదని పిటీషనర్ల వాదనతో ఉన్నత న్యాయస్థానం ఏకీభవించింది. గతంలో ఉన్న రేట్లతోనే అమ్మాలని తేల్చి చెప్పింది.

ప్రభుత్వం జారీ చేసిన జీవోను సవాల్‌ చేస్తూ కొందరు థియేటర్‌ యజమానులు హైకోర్టును ఆశ్రయించారు. కొత్త సినిమాలు విడుదలైన సమయంలో టికెట్‌ రేట్లు పెంచుకునే వెసులుబాటుని గతంలో కోర్టు ఇచ్చింది. ఆ విషయాన్నీ పీటీషనర్లు కోర్టు దృష్టికి తెచ్చారు. వారి వాదనలు సబబే అంటూ కోర్టు పేర్కొంది. ఈ ఏడాది ఆంధ్ర ప్రభుత్వం జీవో నెం.35ను సస్పెండ్‌ చేస్తూ ఆదేశాలు జారీచేసింది.

టికెట్‌ రేట్ల గురించే తెలుగు సినిమా పెద్దలు ప్రభుత్వానికి ఎన్నో విన్నపాలు చేశారు. ఐతే, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఇంతవరకు ఏ విషయం తేల్చలేదు. దాంతో థియేటర్ల యజమానులు కోర్టుని ఆశ్రయించారు.

కోర్టు నిర్ణయం ‘పుష్ప’, ‘ఆర్ ఆర్ ఆర్’, ‘రాధేశ్యామ్’, ‘భీమ్లా నాయక్’ వంటి రాబోయే పెద్ద సినిమాలకు కలిసొచ్చింది. నిన్నటివరకు ఈ రేట్ల విషయంలో తెలుగు చిత్రసీమ ఆందోళనలో ఉంది.

Advertisement
 

More

Related Stories