కరోనా బారిన పడ్డ అర్జున్

Arjun Sarjaa

సినిమా నటులకు మళ్ళీ కరోనా గండం పొంచి ఉంది. పూర్తిగా సమసిపోయింది అనుకుంటున్న తరుణంలో మరోసారి భారతీయ చిత్రసీమలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. తాజాగా హీరో అర్జున్ కరోనా బాధితుడు.

‘ఒకే ఒక్కడు’ వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించిన యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ కరోనా బారిన పడ్డారు. ఇటీవల ఆయన ఓక టీవీ షోకి అటెండ్ అయ్యారు. దానిలో భాగంగా కరోనా టెస్ట్ చేస్తే…రిజల్ట్ పాజిటివ్ గా వచ్చింది.

‘‘నాకు కరోనా వచ్చింది. ప్రస్తుతం ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉన్నాను. కొఇటీవల నన్ను కలిసిన వాళ్లంతా టెస్టులు చేయించుకోవాలని కోరుతున్నాను. ఆందోళన చెందాల్సినదేమి లేదు. అందరూ మాస్క్‌ తప్పనిసరిగా ధరించండి’’ అని తన సోషల్ మీడియా అకౌంట్ లో రాశారు అర్జున్.

59 ఏళ్ల అర్జున్ ఇప్పటికే రెండు సార్లు వ్యాక్సిన్ తీసుకున్నారు. వ్యాక్సిన్ తీసుకున్నా కరోనా వస్తుంది. ఐతే, తీవ్రత చాలా తక్కువ ఉంటుంది.

Advertisement
 

More

Related Stories