జూనియర్ బెల్లంకొండ జోరు

Bellamkonda Ganesh

నిర్మాత బెల్లంకొండ సురేష్ పెద్ద కొడుకు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా మంచి పొజిషన్ లో సెటిల్ అయ్యారు. యాక్షన్ హీరో ఇమేజ్ ఉంది బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కి. అతనిప్పుడు ‘ఛత్రపతి’ హిందీ రీమేక్ తో బాలీవుడ్ ప్రేక్షకులకు కూడా పరిచయం అవుతున్నారనేది ఓల్డ్ న్యూస్.

రెండో కొడుకు కూడా జోరు చూపిస్తున్నాడు. బెల్లంకొండ గణేష్ హీరోగా మూడో సినిమా ప్రారంభించాడు. బెల్లంకొండ గణేష్ హీరోగా మొదలైన మొదటి సినిమా ఇంకా షూటింగ్ పూర్తి చేసుకోలేదు. విడుదల కాలేదు. అది అలా ఉండగానే రెండో సినిమా ఇటీవలే మొదలైంది.

ఈ రోజు మూడో సినిమా లాంచ్ అయింది. ఇటీవల ‘నాంది’ అనే సినిమాని నిర్మించిన సతీష్ వేగేశ్న వర్మ ఈ సినిమాకి నిర్మాత. కొత్త దర్శకుడు రాకేష్ ఉప్పలపాటి ఈ మూవీని తీస్తున్నాడు. సో, జూనియర్ బెల్లంకొండ మంచి జోరు మీదున్నాడు. మొదటి సినిమా రిలీజ్ కాకముందే మూడోది మొదలైంది.

Advertisement
 

More

Related Stories