జెర్సీకి ఓపెనింగ్ వచ్చేనా?

Jersey

దిల్ రాజు, అల్లు అరవింద్ కలిసి నిర్మించిన మొదటి హిందీ చిత్రం… “జెర్సీ”. బాలీవుడ్ లో అనేక సినిమాల నిర్మాణాన్ని ప్లాన్ చేశారు దిల్ రాజ్. “జెర్సీ” అనే పేరుతో నాని హీరోగా విడుదలైన సినిమాకి ఇది హిందీ రీమేక్. షాహిద్ కపూర్ హీరోగా నటించారు. ఐతే, బాలీవుడ్ లో ఇప్పుడు ఏ సినిమాకి కూడా భారీ ఓపెనింగ్స్ వచ్చే పరిస్థితి కనిపించడం లేదు.

రణవీర్ సింగ్ నటించిన ’83’ సినిమాకి కూడా మోస్తరు కలెక్షన్ వచ్చింది. ఈ నేపథ్యంలో షాహిద్ కపూర్ సినిమాకి ఎలాంటి ఓపెనింగ్ వస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది. షాహిద్ గత చిత్రం ‘కబీర్ సింగ్’ సంచలన విజయం సాధించింది. 300 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు అందుకొంది. మరి, “జెర్సీ”తో కూడా షాహిద్ తన సత్తా చాటుతాడా అన్నది చూడాలి.

హిందీలో కూడా తెలుగులో డైరెక్ట్ చేసిన గౌతమ్ తిన్ననూరి తీశారు.

షాహిద్ కపూర్ కన్నా దిల్ రాజుకి ఈ సినిమా విజయం కీలకం. ఆయన మరో నాలుగు చిత్రాలు హిందీలో లైనప్ చేసి పెట్టారు. వాటికి క్రేజ్ రావాలంటే ఇది ఆడాలి.

Advertisement
 

More

Related Stories