హిందీలో మరో రికార్డు

KGF 2

‘కేజీఎఫ్ 2’ దూకుడు ఇంకా ఆగడం లేదు. హిందీ మార్కెట్ లో ఈ సినిమా ఇంకా మంచి కలెక్షన్లను సాధిస్తోంది.

ఈ సినిమా ఇప్పటికే మూడో అతిపెద్ద హిందీ చిత్రంగా నిలబడింది. “పీకే”, “సంజు”, “టైగర్ జిందా హై” వంటి భారీ హిట్ చిత్రాల వసూళ్లను ఈ సినిమా రెండు వారాల్లోనే దాటేసింది.

ఇండియాలో అత్యధిక వసూళ్లు అందుకున్న మూడు చిత్రాలు ఇవే…

బాహుబలి 2 – రూ. 510 కోట్లు
దంగల్ – రూ. 387 కోట్లు
కేజీఎఫ్ 2 – రూ. 342 కోట్లు

మరి ఈ మూవీ దంగల్ రికార్డుని కూడా దాటుతుందా అన్నది చూడాలి. ఈ వీకెండ్ అజయ్ దేవగన్ నటించిన “రన్ వె 34”, టైగర్ స్రోప్ నటించిన “హీరోపంటి 2” విడుదలవుతున్నాయి. వాటితో పోటీపడి మరో 45 కోట్లు రాబడుతుందా? అలా జరిగితే, అమీర్ ఖాన్ మూవీ (దంగల్) రికార్డు కూడా ఎగిరిపోతుంది. హిందీ మార్కెట్ లో టాప్ రెండు చిత్రాలు కూడా దక్షిణాది చిత్రాలే నిలబడుతాయి

Advertisement
 

More

Related Stories