ఎన్టీఆర్ కోసం నాని లాబీయింగ్!

ఆంధ్రప్రదేశ్ లో తగ్గించిన టికెట్ రేట్లకు వ్యతిరేకంగా వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడేందుకు సినిమా ఇండస్ట్రీలో అందరూ భయపడుతున్నారు. తాజాగా “ఆర్ ఆర్ ఆర్” టీం కూడా ఈ విషయంలో క్లారిటీ ఇచ్చింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాము కోర్టుకు వెళ్తామని వచ్చిన వార్తల్లో నిజం లేదని వివరణ ఇచ్చారు “ఆర్ ఆర్ ఆర్” మేకర్స్.

మరి టికెట్ రేట్లు పెంచకపోతే, “ఆర్ ఆర్ ఆర్” సినిమాకే నష్టం. భారీ రేట్లకు ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. ఇప్పుడు ఉన్న టికెట్ రేట్లతో ఆంధ్రప్రదేశ్ లో అంత కలెక్షన్లు రాబట్టలేరనేది సత్యం. అందుకే, తాము ఇంతకుముందు ఒప్పుకున్న అమౌంట్ లో 30 శాతం కోత పెడుతామని అంటున్నారు డిస్ట్రిబ్యూటర్లు. దాంతో, ఇప్పుడు ఎన్టీఆర్ తరఫున మంత్రి కొడాలి నాని రంగంలోకి దిగినట్లు టాక్.

మంత్రి కొడాలి నాని ఒకప్పుడు నిర్మాత. ఎన్టీఆర్ తో “సాంబ” వంటి చిత్రాలు తీశారు. ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో కీలక మంత్రి. మరి ముఖ్యమంత్రిని టికెట్ రేట్ల విషయంలో ఒప్పిస్తారా లేదా అనేది చూడాలి. ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ ని కొన్ని విషయాల్లో ఒప్పించడం కష్టమని అంటారు. కాకపోతే, ఎన్టీఆర్ కోసం ఆయన తన మనసు మార్చుకోవచ్చు అనే మాట వినిపిస్తోంది.

జనవరి 7న విడుదల కానుంది “ఆర్ ఆర్ ఆర్”.

Advertisement
 

More

Related Stories