మెగాస్టార్ కు పేరు పెట్టింది ఆయనే

చిరంజీవిని గతంలో సుప్రీమ్ హీరో అనేవారు. ఆ తర్వాత ఆయన మెగాస్టార్ అయ్యారు. అయితే ఆయనకు ఆ టైటిల్ పెట్టింది ఎవరనే విషయం చాలామందికి తెలియదు. మెగాస్టార్ కు ఆ బిరుదు ఇచ్చిన వ్యక్తి కేఎస్ రామారావు. ఆ విషయాన్ని ఆయనే స్వయంగా బయటపెట్టారు.

“చిరంజీవి నాకు బాగా ఇష్టమైన హీరో. అప్పటికే ఆయనకు రకరకాల బిరుదులు ఉన్నాయి. సుప్రీమ్ హీరో అనే బిరుదు అందులో బాగా పాపులర్ అయింది. అయితే నేను మాత్రం ఓ కొత్త తరహా పేరు పెట్టాలనుకున్నాను. ఇంతకన్నా మంచి పేరు ఇక ఎవ్వరూ పెట్టలేరు అనే విధంగా ఉండాలని ఆలోచించి ఫిక్స్ చేసిన బిరుదు మెగాస్టార్.”

కేఎస్ రామారావుకు చెందిన క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై పలు చిత్రాలు చేశారు చిరంజీవి. ‘అభిలాష’, ‘ఛాలెంజ్’, ‘రాక్షకుడు’, ‘మరణమృదంగం’, ‘స్టూవర్టుపురం పోలీస్ స్టేషన్’ సినిమాలు వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చాయి. వీటిలో ‘అభిలాష’ సినిమా అంటే తనకు ఎంతో ఇష్టం అంటారు కేఎస్ రామారావు.

“యండమూరి వీరేంద్రనాథ్, సత్యమూర్తి (దేవిశ్రీప్రసాద్ తండ్రి) సహకారంతోనే అభిలాష లాంటి ఓ కొత్త తరహా సినిమా వచ్చింది. ఈ సినిమాలో ముందు నుంచి చిరంజీవినే హీరో అనుకున్నాం. గమ్మత్తేంటంటే.. యండమూరి కథ రాయడమే చిరంజీవి పేరుతో రాశారు,” అని చెప్పారు రామారావు.

Advertisement
 

More

Related Stories