లైలా రీఎంట్రీ

ఒకప్పుడు హీరోయిన్ గా హల్చల్ చేసిన లైలా మరోసారి వెండితెరపై దర్శనమివ్వనున్నారు. తాజాగా ఆమె ఒక మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు.

తమిళ హీరో సూర్య సోదరుడు కార్తీ సినిమాతో ఆమె రీఎంట్రీ మొదలైంది. సూర్య సరసన ఆమె ‘శివపుత్రుడు’ సినిమాలో నటించారు. ఇప్పుడు సోదరుడు కార్తీ చిత్రంలో అక్కగా కనిపించనుండడం విశేషం.

పీఎస్‌ మిత్రాన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కార్తీ సరసన రాశీ ఖన్నా నటిస్తుంది. సిమ్రాన్ చెయ్యాల్సిన పాత్రలో లైలా నటిస్తున్నారు ఇప్ప్పుడు.

లైలాకి 41 ఏళ్ళు. ఆమెకి ఇద్దరు పిల్లలు. 2006లో ఒక వ్యాపారవేత్తని పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు దూరమయ్యారు. ‘ఎగిరే పావురమా’, ‘పెళ్లి చేసుకుందాం’, ‘నువ్వే కావాలి’, ‘పవిత్ర ప్రేమ’ వంటి చిత్రాలు లైలా ఖాతాలో ఉన్నాయి. తెలుగులో కన్నా ఆమె తమిళంలోనే హీరోయిన్ గా ఎక్కువ క్రేజ్ తెచ్చుకున్నారు. మళ్ళీ ఆమె రీఎంట్రీకి కూడా తమిళ సినిమారంగమే స్వాగతం పలికింది.

Advertisement
 

More

Related Stories