MAA Elections 2021: ముంబయి నుంచి వచ్చిన జెనీలియా

కలిసొచ్చిన ప్రకాష్ రాజ్-విష్ణు
ఉద్రిక్తతల్ని చల్లార్చే ప్రయత్నం చేశారు ప్రకాష్ రాజ్, మంచు విష్ణు. ఇద్దరూ కలిసి మీడియా ముందుకొచ్చారు. అంతా సజావుగా సాగుతుందని చెప్పే ప్రయత్నం చేశారు. బ్రహ్మానందం అంకుల్ వచ్చి హంగామా చేశారంటూ జోకులేసి, వాతావరణాన్ని తేలికపరిచే ప్రయత్నం చేశాడు విష్ణు.

లోపల కురుక్షేత్రం నడుస్తోంది: సుమన్
పోలింగ్ బూతు ప్రాంగణంలో విష్ణు, ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యులు కొట్టుకుంటున్నారనే విషయాన్ని సీనియర్ నటుడు సుమన్ ధృవీకరించాడు. లోపల కురుక్షేత్రం జరుగుతుందన్నాడు. సభ్యులంతా బాహాబాహీ గొడవ పడుతున్నారని స్పష్టంగా చెప్పేశాడు.

రిగ్గింగ్ జరగలేదు: కరాటే కల్యాణి
“మా” ఎన్నికల్లో రిగ్గింగ్ జరగలేదన్నారు కరాటే కల్యాణి. లోపలకి అడుగుపెడుతున్న ప్రతి సభ్యుడ్ని తాము చూస్తున్నామని, అనుమానం వస్తే వెంటనే ఆపుతున్నామని అన్నారు. పైగా గుర్తింపు కార్డు లేకుండా ఎవ్వరూ ఓటు వేయలేరు కాబట్టి, రిగ్గింగ్ కు ఆస్కారం లేదన్నారు.

ముంబయి నుంచి వచ్చిన జెనీలియా
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో ఓటు వేసేందుకు ముంబయి నుంచి ప్రత్యేకంగా హైదరాబాద్ వచ్చింది జెనీలియా. మంచు విష్ణు ఆమెను సాదరంగా ఆహ్వానించి, పోలింగ్ కేంద్రంలోకి తీసుకెళ్లాడు.

లోకల్, నాన్-లోకల్ లొల్లి
పోలింగ్ స్టేషన్ బయట పెద్ద గొడవ జరిగింది. ప్రకాష్ రాజ్ కు చెందిన ఓ వ్యక్తి లైన్లో నిల్చుంటే.. నరేష్ వ్యక్తి ఒకరు నాన్-లోకల్ అని అరిచాడు. దీంతో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. పోలీసులు వచ్చి దాన్ని నివారించారు.

మోహన్ బాబు ఉగ్రరూపం
నటుడు బెనర్జీ ఓట్ వేయడానికి వచ్చారు. బెనర్జీని చూస్తేనే మోహన్ బాబు ఉగ్రరూపం దాల్చారు. పైకి మాట్లాడలేని బూతులతో బెనర్జీని తిట్టారు. దీంతో లోపల ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. కొందరు నటుల చొక్కాలు చిరిగాయని సమాచారం.

”మా” ఎన్నికల్లో రిగ్గింగ్
ఓవైపు చురుగ్గా పోలింగ్ జరుగుతున్న వేళ.. సంచలన ఆరోపణలు చేసింది ప్రకాష్ రాజ్ ప్యానెల్. పోలింగ్ లో రిగ్గింగ్ జరుగుతోందని అధికారులకు ఫిర్యాదు చేసింది. దీంతో అధికారులు సీసీటీవీ ఫూటేజ్ ను పరిశీలిస్తున్నారు. ఇదే ఆరోపణను మంచు విష్ణు వర్గం కూడా చేయడం విశేషం.

పోలింగ్ బూత్ లోపల ప్రచారం
మరోవైపు పోలింగ్ బూతు లోపల ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యులు ప్రచారం చేస్తున్నారని మోహన్ బాబు వర్గీయులు ఆరోపించారు. దీంతో కరపత్రాలు పంచుతున్న శివబాలాజీ, సమీర్ ను అధికారులు బయటకు పంపించారు.

పోలింగ్ బూత్ వద్ద కలకలం
ఉన్నట్టుంది ఒక్కసారిగా పోలింగ్ బూత్ వద్ద కలకలం రేగింది. ప్రకాష్ రాజ్ గన్ మెన్లను బయటకు పంపించాల్సిందిగా మోహన్ బాబు ఎన్నికల అధికారిని కోరారు. దీంతో ఎన్నికల అధికారి ప్రకాష్ రాజ్ గన్ మెన్లను బయటకు పంపించారు.

9 గంటలు.. పోలింగ్ స్టేటస్
పోలింగ్ ప్రారంభమై గంట గడిచింది. ఈ గంటలో 30శాతం పోలింగ్ పూర్తయిందని ప్రకటించారు నరేష్. దాదాపు 200 మందికి పైగా సభ్యులు వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని తెలిపారు. 

అందరూ నాకు కావాల్సిన వాళ్లే.. బాలకృష్ణ
తన మనసు చెప్పిన ప్రకారం ఓటు వేశానని ప్రకటించారు బాలకృష్ణ. తన ఓటు వేసిన వాళ్లలో రెండు ప్యానెళ్లకు సంబంధించిన అభ్యర్థులు ఉన్నారన్నారు. సభ్యులంతా అన్నీ మరిచిపోవాలని, వచ్చే వారం నుంచి షూటింగ్స్ లో ఒకరి ముఖం ఒకరు చూసుకోవాలని అన్నారు.

ఓటు హక్కు వినియోగించుకున్న చిరంజీవి
చిరంజీవి కూడా కాస్త ముందుగానే పోలింగ్ స్టేషన్ కు చేరుకున్నారు. తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. భవిష్యత్తులో ఇంత పోటీ లేకుండా జాగ్రత్త పడతామని ప్రకటించారు చిరు.

పవన్ కల్యాణ్.. అందరికంటే ముందు
ఊహించని విధంగా పవన్ కల్యాణ్ అందరికంటే ముందే పోలింగ్ స్టేషన్ వద్ద ప్రత్యక్షమయ్యారు. తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. బయటకొచ్చి మీడియాతో మాట్లాడుతూ.. కూర్చొని పరిష్కరించుకుంటే సమస్యలు సమసిపోయేవంటూ స్పందించారు. ఇన్నాళ్లూ సభ్యులు చేసిన వ్యాఖ్యలన్నీ వ్యక్తిగతమని,
ఇండస్ట్రీకి అంటవని అన్నారు.

కౌగిలించుకున్న ప్రత్యర్థులు
ఎన్నికల ప్రక్రియ మొదలుకాకముందే సమీప ప్రత్యర్థులు మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ కలిసిపోయారు. ఫార్మల్ గా షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడమే కాకుండా కౌగిలించుకున్నారు. ప్రకాష్ రాజ్ మరో అడుగు ముందుకేసి, మోహన్ బాబు కాళ్లకు మొక్కడం కొసమెరుపు.

మొదలైన ”మా” పోలింగ్
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ మొదలైంది. జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్ లోని 3 గదుల్లో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన పోలింగ్ బూత్స్ లో ఎన్నికల ప్రక్రియ మొదలైంది. ఉదయం 7.30 నుంచే సభ్యులు ఓటింగ్ కు రావడం మొదలైంది. ప్రకాష్ రాజ్, మంచు విష్ణుతో పాటు ప్యానెల్ సభ్యులంతా పొద్దున్నే పోలింగ్ స్టేషన్స్ కు చేరుకున్నారు.

Advertisement
 

More

Related Stories