‘సమంతని ఆ హీరో ట్రాప్ చేశాడు’

Samantha and Madhavilatha

డివోర్స్ విషయంలో హీరోయిన్ సమంత తప్పు లేదని చెప్తోంది మాధవీలత. సమంతని తప్పు పట్టకూడదు అని అంటోంది ఈ భామ. ఫేస్ బుక్ లైవ్ లో అభిమానులతో రకరకాల విషయాలపై ఈ భామ ముచ్చటిస్తూ ఉంటుంది. లేటెస్ట్ గా సమంత గురించి మాట్లాడింది.

“సమంత విడాకుల విషయంలో నేను మూడు రకాల కామెంట్స్ చూశాను. ఒకటి: సినిమా వాళ్ళ కాపురాలు ఎక్కువకాలం ఉండవనే మాట అంటున్నారు. రెండోది: సమంత వేసుకున్న డ్రెస్సుల గురించి చీప్ గా మాట్లాడారు. మూడోది: ఆమె మతం గురించి. వీటికి నా సమాధానం ఏంటంటే బయట ప్రపంచంలోనే ఎక్కువ విడాకుల కేసులు చూస్తున్నాం. బయట ఒక్కో కేసు బతుకు జట్కా బండిలా ఉంది. ఇక సమంత గ్లామర్ గా డ్రెస్సులు వేసుకుందని విమర్శించే వారికి నేను చెప్పేది ఏంటంటే నాగ చైతన్యకి తెలీదా ఆమె ఎలాంటి డ్రెస్సులు వేసుకుంటుందో. కొత్తగా వచ్చిన సమస్య ఏంటి. మూడోది ఆమె హిందూ మతాన్నీ ఎప్పుడూ కించపర్చలేదు. పైగా ఆమె తిరుపతికి కాలి నడకన వెళ్తుంది. పూజలు చేస్తుంది. క్రిస్టియన్ గా పుట్టింది కాబట్టి ఆ మతాన్ని కూడా ఆచరిస్తుంది. పుట్టింటి ధర్మాన్ని, మెట్టింటి ధర్మాన్ని రెండూ బ్యాలెన్స్ చేసింది,” ఇలా సమర్ధించింది మాధవీలత.

సమంతకి డబ్బు పిచ్చి లేదు అని కూడ చెప్పింది మాధవీలత.

“సినిమాలు, బ్రాండ్స్ ద్వారా వచ్చే ఆదాయం మినహా… ప్రారంభోత్సవాలు, ఇతర ఈవెంట్స్ కి గెస్ట్ గా వెళ్తే వచ్చే డబ్బులను ఆమె ప్రత్యూష ఫౌండేషన్ కి దానం చేస్తుంది. సమంత చాలా మంచిది. ఆమె మంచి హృదయమున్న మనిషి,” మాధవీలత సమంతకి ఇలా ఫుల్ సపోర్ట్ ఇచ్చింది.

గతంలో ఒక హీరో సమంతను ట్రాప్ చేసి ఆమె డబ్బుని లాగేసాడనే ఆరోపణ కూడా చేసింది మాధవీలత. ఆ హీరో పేరు చెప్పలేదు.

Advertisement
 

More

Related Stories