నిహారిక సంగీత్ లో ధూంధామ్

నిహారిక వెడ్డింగ్ సెలెబ్రేషన్స్ జోరుగా సాగుతున్నాయి. నిన్న రాత్రి సంగీత్ జరిగింది. ఉదయ్ పుర్ లోని ఒబెరాయ్ పాలస్ లోనే సంగీత్ ధూమ్ ధామ్ గా సాగింది. మెగాస్టార్ చిరంజీవి, ఆయన భార్య, సురేఖ, రామ్ చరణ్, ఉపాసన, అల్లు అర్జున్, స్నేహ, అల్లు అరవింద్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, అల్లు శిరీష్, ఇంకా ఇతర ఫ్యామిలీ మెంబర్స్ అందరూ డాన్సులు, ఆటాపాటలతో చాలా హడావిడి చేశారు.

Advertisement

పెళ్లి కూతురు నిహారిక, పెళ్ళికొడుకు వెంకట్ చైతన్య స్టేజిపై పలు సినిమా పాటలకు డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఫోటోలని, వీడియోలని సోషల్ మిడియాలో పోస్ట్ చేసేందుకు, వైరల్ చేసేందుకు స్పెషల్ టీంని పెట్టుకున్నట్లు ఉన్నారు.

రేపు రాత్రికి నిహారిక పెళ్లి ముహూర్తం. మొత్తం మెగా ఫ్యామిలీ పెళ్లి సంబరాలను బాగా ఎంజాయ్ చేస్తోంది. మెగాస్టార్ కి బంధువు అయిన దర్శకుడు మెహెర్ రమేష్ అక్కడి ఫోటోలని కొన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

Advertisement
 

More

Related Stories