సెకండాఫ్ కలిసిరాలేదు

Vaisshnav Tej

మెగాస్టార్ చిరంజీవి ఈ ఏడాది ‘వాల్తేర్ వీరయ్య’తో భారీ హిట్ అందుకున్నారు. అదే ఊపులో మరో భారీ హిట్ అందుకోవాలనుకున్నారు కానీ ఆగస్టులో విడుదలైన “భోళాశంకర్” ఘోరంగా పరాజయం పాలైంది.

“విరూపాక్ష” సినిమాతో సమ్మర్ లో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు సాయి ధరమ్ తేజ. కానీ జూలైలో విడుదలైన “బ్రో” సినిమా సో సో అనిపించుకుంది. ఓపెనింగ్ కలెక్షన్ల తర్వాత పెద్దగా నిలబడలేదు.

అక్టోబర్ లో మరో మెగా హీరో కూడా ఫ్లాప్ చూశాడు. “గాండీవధారి అర్జున” అంటూ ప్రేక్షకుల ముందుకు వస్తే జనం అవుట్ రైట్ గా తిరస్కరించారు.

ఇక లేటెస్ట్ గా సాయి ధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ ది అదే పరిస్థితి. గత వారం విడుదలైన “ఆదికేశవ” ఘోర పరాజయం పాలైంది. ఓవరాల్ గా 2023 సెకండాఫ్ లో విడుదలైన ఏ మూవీ కూడా మెగా హీరోలకు ఆనందాన్ని ఇవ్వలేదు. ఈ ఏడాది రామ్ చరణ్, అల్లు అర్జున్ చిత్రాలు విడుదల కాలేదు.

Advertisement
 

More

Related Stories