నారాయ‌ణ దాస్ నారంగ్ కన్నుమూత

Narayana Das Narang

ప్ర‌ముఖ నిర్మాత‌, చ‌ల‌నచిత్ర వాణిజ్య‌మండ‌లి అధ్య‌క్షుడు నారాయ‌ణ దాస్ నారంగ్ (76) క‌న్నుమూశారు. గ‌త కొంత‌కాలంగా అనారోగ్యంతో వున్న ఆయ‌న స్టార్ ఆసుప్ర‌తిలోచికిత్స తీసుకుంటూ మంగ‌ళ‌వారం ఉద‌యం తుదిశ్వాస విడిచారు. ఆయ‌న‌కు ఇద్ద‌రు కుమారులు, ఒక కుమార్తె వున్నారు. ఆయ‌న కుమారులు సునీల్ నారంగ్‌, భ‌ర‌త్ నారంగ్ కూడా నిర్మాత‌లే.

ఇటీవల నారాయణ దాస్ నారంగ్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్ స్టోరీ’ నిర్మించారు. ప్రస్తుతం పలు చిత్రాలను లైన్లో ఉంచారు.

నారాయ‌ణ దాస్ నారంగ్ 1946 జులై 27న జ‌న్మించారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ కాలం నుంచి డిస్ట్రిబూట‌ర్‌గా, ఫైనాన్సియర్ గా ఇండస్ట్రీలో ఉన్నారు. ఏషియ‌న్ గ్రూప్ అధినేతగా ఆయిన పేరు పొందారు. తెలంగాణ‌లో పంపిణీదారునిగా ఆయ‌న మంచి పేరు ప్ర‌ఖ్యాతులు పొందారు.

ఆయ‌న మృతి ప‌ట్ల తెలుగు చ‌ల‌న‌చిత్ర వాణిజ్య‌మండ‌లి, తెలంగాణ వాణిజ్య‌మండ‌లి త‌మ ప్ర‌గాఢ‌సానుభూతి తెలియ‌జేసింది.

Advertisement
 

More

Related Stories