పార్టీలు, డిన్నర్లతో నిహారిక బిజీ

Niharika Wedding party

ఈ నెల 9న నిహారిక పెళ్లి. అయితే గత వరం రోజులుగా నిహారిక వరుసగా ప్రీ-వెడ్డింగ్ పార్టీలు, డిన్నర్ లు హోస్ట్ చేస్తోంది. మొదట తన ఫ్రెండ్స్ కి డిన్నర్ పార్టీ ఇచ్చింది. తర్వాత తన కాబోయే భర్త వెంకట చైతన్య ఫ్రెండ్స్ తో లంచ్ పార్టీ. ఆ తర్వాత తన సిస్టర్స్ కి (కజిన్స్)కి పార్టీ ఇచ్చింది. లేటెస్ట్ గా మొత్తం మెగా ఫ్యామిలీలో ఉన్న కొత్త జనరేషన్ కి పార్టీ ఇచ్చింది.

ఈ పార్టీలో వరుణ్ తేజ్, సాయి తేజ్, వైష్ణప్ తేజ్, ,అల్లు శిరీష్, అల్లు బాబీ, అల్లు అర్జున్ వైఫ్ స్నేహ, సుష్మిత, శ్రీజ, వాళ్ళ లైఫ్ పార్ట్ నర్స్…. ఇలా అందరూ పాల్గొన్నారు. అల్లు అర్జున్, రామ్ చరణ్ మాత్రం షూటింగ్ ల కారణంగా అటెండ్ అవ్వలేదు.

నిహారిక పెళ్లి రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో జరగనుంది. ఈ నెల 11న హైదరాబాద్ లో వెడ్డింగ్ రిసెప్షన్ ఉంటుంది.

Advertisement
 

More

Related Stories